Marcy Calvert : 8 నెలల క్రితం సముద్రంలో పోగొట్టుకున్న పర్సు.. తిరిగి యజమాని దగ్గరికి?

మనం తినే ప్రతి గింజపై పేరు రాసి ఉంటుందని చాలామంది పెద్దలు చెబుతుంటారు.అంటే మనకు ఏదైనా చెందాలని రాసిపెట్టి ఉంటే చివరికి అది మన వద్దకే వస్తుందని అర్థం.

 The Wallet Lost In The Sea 8 Months Ago Returned To The Owner-TeluguStop.com

ఈ విషయం చాలామంది జీవితాల్లో నిజమయ్యింది.ఇలాంటి సంఘటన మరొకటి చోటుచేసుకుంది.8 నెలల క్రితం సముద్రంలో పర్సు పోగొట్టుకున్న ఒక మహిళ తాజాగా దానిని తిరిగి పొందగలిగింది.ఆమె పేరు మార్సీ కల్లావెర్ట్( Marcy Calvert ).ఈమె బ్రిటీష్ కొలంబియాలోని టోఫినో ( Tofino, British Columbia )సమీపంలోని ఒక చిన్న ద్వీపంలో నివసిస్తోంది.అక్కడ తన జీవితం గురించి వీడియోలను తీసి టిక్‌టాక్‌లో షేర్ చేస్తుంది.ఆమెను 47,000 మందికి పైగా ఫాలో అవుతున్నారు.

2023 జూన్‌లో ఒకరోజు, ఆమె తన బ్యాక్‌ప్యాక్‌తో పాటు పడవ ఎక్కింది.ఆ సమయంలో ఆమె వాలెట్ నీటిలో పడిపోయింది, ఏంటా ఆ శబ్దం అని చూసుకోగానే తన పర్సు పోయినట్లు అర్థమయింది.దాంతో బాగా బాధపడింది.ఇందులో విలువైన వస్తువులు ఉండటంతో దాన్ని వెతికి పట్టుకునేందుకు చాలా ప్రయత్నించింది.ఒక డైవర్‌ని కూడా అది తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు కానీ విఫలమయ్యాడు.

దాంతో ఇక ఆమె వాలెట్‌ దొరకదని ఆశలు వదిలేసుకుంది.

కట్ చేస్తే, ఎనిమిది నెలల తరువాత, ఆమెలో జీవితంలో ఓ అద్భుతమైన ఘటన చోటు.బీచ్‌లో తన కుక్కలను వాకింగ్ చేయిస్తుండగా ఆమెకు సముద్రం ఒడ్డుకు ఒక వస్తువు కనిపించింది.దానిని చేతిలోకి తీసుకొని చూడగా అది తాను పోగొట్టుకున్న వాలెట్ తెలిసింది.

దాంతో ఆమె చాలా ఆశ్చర్యపోయింది.అన్ని రోజులైనా అది సముద్రంలో కలిసిపోకుండా, వేరే వారికి దొరకకుండా, చివరికి తనకే లభించడం ఒక మిరాకిల్ లాగా ఆమెకు అనిపించింది.

వాలెట్ చాలా కాలం పాటు సముద్రంలో ఉంది, కానీ అది మంచి స్థితిలో ఉంది.జిప్పర్ మాత్రం పాడయింది.పర్సు లోపల ఉన్న డబ్బు, కార్డులు పాడైపోలేదు.అందులో దాదాపు 20 డాలర్ల క్యాష్, గుర్తింపు కార్డులు అన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయి.ఆమె ఈ వాలెట్‌ మళ్లీ తన అంత జీవితంలోకి వచ్చిందని చెబుతూ ఓ వీడియో టిక్‌టాక్‌లో పోస్ట్ చేసింది.ఈ వీడియో బాగా పాపులర్ అయింది, దీనికి 7 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

చాలా మంది వ్యక్తులు, వార్తా సంస్థలు దీని గురించి ఆమెతో మాట్లాడాలని కోరుకున్నారు.సముద్రం తన వాలెట్‌ను తిరిగి ఇచ్చినందుకు చాలా సంతోషంగా, కృతజ్ఞత ఉన్నానని మీడియాతో ఆమె చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube