Navadeep : మెగా హీరోలంతా ట్రెండ్ సెట్ చేసిన వాళ్లే.. నవదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో హీరోలు మెగా ఫ్యామిలీలో ఉండగా మెగా హీరోలకు( Mega Heroes ) ప్రేక్షకుల్లో క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.మెగా హీరోలలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాలకు 200 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది.

 Navadeep Interesting Comments About Mega Heroes Details Here Goes Viral In Soci-TeluguStop.com

సాయితేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది.అల్లు అర్జున్ కూడా మెగా ఇమేజ్ వల్లే ఈ స్థాయికి చేరుకున్నారు.

అయితే మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులలో నవదీప్( Navadeep ) ఒకరు కాగా మెగా హీరోలంతా ట్రెండ్ సెట్ చేసిన వాళ్లే అంటూ నవదీప్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఆపరేషన్ వాలంటైన్( Operation Valentine ) ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో నవదీప్ మాట్లాడుతూ మెగా హీరోలంతా ట్రెండ్ సెట్ చేసిన వాళ్లే అని చెప్పుకొచ్చారు.

సౌత్ ఇండియాలో బన్నీ మొట్టమొదట సిక్స్ ప్యాక్ చేశారని ఆయన అన్నారు.

రామ్ చరణ్( Ram Charan ) గ్లోబల్ రేంజ్ కు వెళ్లిపోయారని నవదీప్ పేర్కొన్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి సైతం నవదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తెలుగులో ఫస్ట్ టైమ్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో వరుణ్ తేజ్( Varun Tej ) నటించాడంటూ నవదీప్ కామెంట్లు చేశారు.

మెగా ఫ్యామిలీ రేడార్ లో అభిమానులు అంతా ఉండగా ఏమీ కాదని నా ఉద్దేశం అని నవదీప్ చెప్పుకొచ్చారు.

నవదీప్ వెల్లడించిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.నవదీప్ చేసిన కామెంట్లు మెగా ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి.రాబోయే రోజుల్లో నవదీప్ మరిన్ని ఆఫర్లతో బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మెగా హీరోలకు రాబోయే రోజుల్లో భారీ విజయాలు దక్కాలని అభిమానులు ఫీలవుతున్నారు.మెగా హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube