ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదే విషయాన్ని ప్రధాన పార్టీల నాయకులు తమ కేడర్ కి తెలియజేస్తూ ఉన్నారు.2024 ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పక్క వ్యూహాలతో సిద్ధపడుతున్నారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) ఒంటరిగా పోటీ చేస్తుండగా తెలుగుదేశం జనసేన పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా జనసేన నాయకుడు నాగబాబు( Nagababu ) కీలక వ్యాఖ్యలు చేశారు.స్వాతంత్ర్యం తరువాత ఏ రాష్ట్రంలోనూ వైసీపీ లాంటి చెత్త ప్రభుత్వాన్ని చూడలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మరో రెండు నెలలు కష్టపడదామని పార్టీ కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చారు.వచ్చేది జనసేన, టీడీపీ( Janasena, TDP ) ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్రంలో భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ జనసేన అని పేర్కొన్నారు.రాజకీయాలను మలుపు తిప్పగల సత్తా జనసేనకే ఉందని నాగబాబు స్పష్టం చేశారు.రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.సినిమాలు విడుదలైనప్పుడే మనం మెగా ఫాన్స్.
మిగిలిన సమయంలో జనసైనికులం.వీర మహిళం.
మన ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు తాతలు, తండ్రుల పేర్లు కాకుండా మహనీయుల పేర్లు పెడదాం.ఆదివారం అనకాపల్లిలో మెగా ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంలో నాగబాబు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.