టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Leader Chandrababu ) కటౌట్ కు ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న( Buddha Venkanna ) రక్తంతో అభిషేకం చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామిభక్తితో చంద్రబాబు హృదయాన్ని కదలించడం కోసం ఇలా చేశానని పేర్కొన్నారు.
అంతేకానీ నిరసన కాదని తేల్చి చెప్పారు.చంద్రబాబు తనకు దేవుడని తెలిపారు.
అయితే కొన్ని వాస్తవాలు చంద్రబాబుకు తెలియాలనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు.చంద్రబాబు తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారన్నారు.
కేశినేని నాని( Kesineni Nani ) వచ్చిన తరువాత తనను తీసేయాలంటూ చంద్రబాబుకు పదే పదే చెప్పేవాడని, వేరే వాళ్లకు సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు.తనను పార్టీ నుంచి తప్పించాలనేది కేశినేని నాని ఎజెండా అని మండిపడ్డారు.