Buddha Venkanna : చంద్రబాబు కటౌట్ కు రక్తంతో అభిషేకం చేసిన బుద్దా వెంకన్న..!

టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Leader Chandrababu ) కటౌట్ కు ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న( Buddha Venkanna ) రక్తంతో అభిషేకం చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామిభక్తితో చంద్రబాబు హృదయాన్ని కదలించడం కోసం ఇలా చేశానని పేర్కొన్నారు.

అంతేకానీ నిరసన కాదని తేల్చి చెప్పారు.చంద్రబాబు తనకు దేవుడని తెలిపారు.

అయితే కొన్ని వాస్తవాలు చంద్రబాబుకు తెలియాలనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు.చంద్రబాబు తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారన్నారు.

కేశినేని నాని( Kesineni Nani ) వచ్చిన తరువాత తనను తీసేయాలంటూ చంద్రబాబుకు పదే పదే చెప్పేవాడని, వేరే వాళ్లకు సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు.

తనను పార్టీ నుంచి తప్పించాలనేది కేశినేని నాని ఎజెండా అని మండిపడ్డారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు తీపికబురు.. వార్2 సినిమా నుంచి ఫస్ట్ లుక్ అప్పుడేనా?