Child Artist Kiara Khanna : వామ్మో కియారా ఇంత పెద్ద చిచ్చరపిడుగా? ఖచ్చితంగా పెద్ద హీరోయిన్ అవుతుంది !.

చాలామంది హాయ్ నాన్న సినిమా( Hi Nanna ) నాని కోసం చూసారు అనుకుంటారు కానీ కొంత మంది నాని కోసం చూసారు కానీ అంతకన్నా ఎక్కువ మంది ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కియారా కోసం చూశారు ఎందుకంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఆమెను చూడగానే ఏదో ఒక కొత్త వైబ్ కనిపించింది.అలాగే ప్రమోషన్స్ లో ఆమె కనిపించిన ప్రతిసారి కూడా ఒక కొత్తదనం అనిపించింది.

 Child Artist Kiara Amazing Acting Skills-TeluguStop.com

అందుకే కియారా( Child Artist Kiara ) కోసం చాలామంది సినిమాకి వెళ్లారు.చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లా అనిపించింది.

అయితే కియారా కూడా మామూలు చైల్డ్ ఆర్టిస్ట్ అయితే మనం ఇప్పుడు ఇలా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఆమె పెద్ద చిచ్చరపిడుగు.

Telugu Childartist, Nanna, Mrunal Thakur, Nani-Movie

ఎంతలా అంటే సినిమా అంటే ఎంతో ఇష్టం.సినిమా కోసం ఏమైనా చేస్తుంది.కేవలం ఏడు సంవత్సరాల వయసులో కియారా కి ఒక పెద్ద హీరోయిన్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని కూడా కలిగి ఉంది.

ముఖ్యంగా ఏదైనా ఎమోషన్ సీన్ షూట్ చేయాల్సిన సమయం రాగానే తన ఫ్యామిలీ అంతా ఢిల్లీ( Delhi )లో ఉంటారు కాబట్టి మొబైల్ లో తన చెల్లి ఫోటో చూసి ఆమెను మిస్ అవుతున్న ఫీల్ తో ఆటోమేటిక్ గా గ్లిజరిన్ లేకుండా అలా చాలాసార్లు ఎమోషన్స్ సీన్స్ లో కన్నీళ్లు చాలా న్యాచురల్ గా తెచ్చుకునేదట, ఆ ఎమోషన్ సీన్( Emotional Scene ) అయిపోయే వరకు కూడా అలాగే మైంటైన్ చేసేది.పెద్ద హీరోయిన్స్ అప్పట్లో సావిత్రి లాంటి వారు ఇలా చేశారంటే ఒప్పుకోవచ్చు.

కానీ ఏడేళ్ల కియారా వారిని మించి పోయేలా ఉంది.

Telugu Childartist, Nanna, Mrunal Thakur, Nani-Movie

పైగా ఈ సినిమా కోసం తన డబ్బింగ్( Dubbing ) తానే చెప్పుకుందట.అప్పటికి తెలుగు ఒక్క ముక్క కూడా రాదు అలాగే ఎవరు మాట్లాడిన అర్ధం అయ్యేది కాదు.సినిమాలో నటించాలి అనే డెడికేషన్ తో కేవలం ఈ సినిమాలో నటించడం కోసం తెలుగు కూడా నేర్చుకుందట.

పైగా చాలా కాన్ఫిడెంట్ గా ఇంటర్వ్యూస్ లో ఆమె మాట్లాడుతూ ఉండడం చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు.ఇక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె మృణాల్ తో కలిసి చేసిన డాన్స్ మూమెంట్స్( Dance Moments ) అయితే ఎవరూ మర్చిపోలేరు కూడా.

ఇలా డాన్స్ నటనతో ఇప్పుడే కుమ్మేస్తుందంటే మరి భవిష్యత్తులో ఎంత పెద్ద నటి అవుతుందో ప్రత్యేకంగా చెప్పాలా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube