Elephant Video : ఈ బస్సు డ్రైవర్ ఏనుగును ఎంత ఆప్యాయంగా పిలుస్తున్నాడో.. చూస్తే ఫిదా..!

ప్రస్తుతం సోషల్ మీడియా( Social Media )లో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చక్కర్లు కొడుతుంది.ఆ వీడియోని తమిళనాడుకు చెందిన ఒక బస్సు డ్రైవర్ రికార్డ్ చేసాడు.

 Driver Stops Bus For Wild Elephant Crossing Forest Road Viral Video-TeluguStop.com

IAS అధికారిణి సుప్రియా సాహు( IAS Supriya Sahu ) ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా దీనిని షేర్ చేశారు.ఈ వీడియోలో బస్సులోని ప్రయాణీకులు భయపడుతున్నట్లు మనం చూడవచ్చు.

ఆ బస్సు డ్రైవర్ మాత్రం చాలా కామ్ గా ఉన్నాడు.కామ్ గా మాట్లాడుతున్నాడు.

అంతేకాదు, ఏనుగును అన్న అంటూ ఆప్యాయంగా పిలిచాడు.బీఆర్టీ టైగర్ రిజర్వ్లోని పుంజనూర్ రేంజ్ పరిధిలోని తమిళనాడు-కర్ణాటక సరిహద్దు సమీపంలోని కరపల్లం చెక్పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది.

కరపల్లం చెక్పోస్ట్( Karapallam Checkpost ) మార్గంలో బస్సు వెళ్తుండగా అదే మార్గంలో బస్సుకి ఎదురుగా ఒక ఏనుగు కూడా వచ్చింది.దీంతో ఆ బస్సు డ్రైవర్ కంగారు పడకుండా వెంటనే పరిస్థితిని అంచనా వేసి, బస్సును అక్కడే రోడ్ మీదనే ఆపి, తన ప్రయాణీకులను భయపడకుండా ప్రశాంతంగా ఉండమని కోరాడు.అంత దగ్గరలో ఏనుగు( Elephant ) ఉండటంతో ప్రయాణికులు చాలా భయపడిపోయారు.అది దాని చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించినప్పుడు అందరికీ చెమటలు పట్టేసాయి.కానీ డ్రైవర్ గొంతు వారికి మనం సురక్షితం అనే ఓ భరోసా ఇచ్చింది.బస్సులోని ప్రయాణికులను ఏం చప్పుడు చేయకపోవడంతో ఆ ఏనుగు అక్కడి నుంచి వెళ్లిపోయింది.

అది వెళ్లిపోయేవరకు డ్రైవర్( Bus Driver ) కంగారు లేకుండా బస్సు ని అలానే నిలిపివేశాడు.

ఆ వీడియో చూసిన IAS ఆఫర్ బస్సు డ్రైవర్ ను ‘మిస్టర్ కూల్'( Mr.Cool ) అని పిలిచారు.ఏనుగు దాటిపోయే వరకు డ్రైవర్ ఓపికగా వేచి ఉన్నాడని ఆమె చెప్పారు.

అతను ఏనుగును “అన్నా” అని సంబోధించాడు.అలా సౌమ్యంగా మాట్లాడుతూ బస్సును నైపుణ్యంగా నడిపిస్తూ వీడ్కోలు పలికాడు.

ఈ బ్యూటిఫుల్ వీడియోను మూర్తి అనే ప్రయాణీకుడు రికార్డ్ చేశాడు.ఈ వీడియో చూసిన నేటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

డ్రైవర్ ప్రవర్తనను ప్రశంసించి అతన్ని గౌరవించాలని కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube