యాదాద్రి భువనగిరి జిల్లా: ఇప్పటికైనా బీజేపీ అతిధి పాత్రల నాయకులను నమ్ముకునే కంటే పార్టీని నమ్ముకున్న నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే, ఎంపీ అవకాశాలు ఇవ్వాలని యాదాద్రి భువనగిరి జి( Yadadri Bhuvanagiri )ల్లా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కలి రాజు యాదవ్ ( Jakkali Raju Yadav )శనివారం ఒక ప్రకటనలోతెలిపారు.
మునుగోడు నియోజకవర్గం( Munugode Assembly constituency )లో పార్టీని నమ్ముకున్న నాయకులను, కార్యకర్తలను అవమానపరిచే బదులు, బీజేపీ జెండా గ్రామ గ్రామాన ఎగురవేసి,పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకులను పక్కనపెట్టి,ఇతర పార్టీల నుండి వస్తున్న నాయకులకు టికెట్ ఇచ్చి మాలాంటి కార్యకర్తలను అవమానపరచడం సరైనది కాదన్నారు.
సిద్ధాంతాలు ఉన్న పార్టీ బీజేపీ అని,సిద్ధాంతాలను తుంగలో తొక్కడానికి ఇతర పార్టీల నుండి వచ్చి అవమానపరుస్తున్నారని మండిపడ్డారు.అధిష్టానం ఇలాంటివి జరగకుండా కార్యకర్తలను గుర్తించాలని కోరారు.
ఇకనైనా రాబోయే ఎలక్షన్లలో సీనియర్ నాయకులను దింపి భువనగిరిలో బీజేపీ జెండా ఎగరవేయాలని కోరారు.