కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజ్ గేట్లు( Annaram Barrage Gates ) తెరుచుకున్నాయి.నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ( National Dam Safety Authority )ఆదేశాల మేరకు అధికారులు గేట్లను ఓపెన్ చేశారు.
ఈ మేరకు బ్యారేజ్ లోని పది గేట్లు ఎత్తి సుమారు 13 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.సరస్వతి బ్యారేజ్ నుంచి ఈ నీళ్లు మేడిగడ్డలోకి చేరనున్నాయి.
తరువాత మేడిగడ్డ గేట్లు ( Madigadda gates )ఎత్తిన అధికారులు నీటిని దిగువకు వదలనున్నారు.బ్యారేజ్ ఖాళీ చేసిన తరువాత ఎన్డీఎస్ఏ అధికారులు పరిశీలించనున్నారు.
కాగా వారం రోజుల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం తెలంగాణకు రానుంది.ఈ మేరకు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ను ఎన్డీఎస్ఏ పరిశీలించనుంది.