బుల్లితెర నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి తేజస్విని గౌడ ( Tejaswini Gowda ) ఒకరు.ఈమె ప్రస్తుతం మరో బుల్లితెర నటుడు అమర్ దీప్ చౌదరిని( Amar Deep Chowdary ) పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.ఇటీవల అమర్ బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమానికి వెళ్లారు.
ఆయన పట్ల ఎంతో నెగెటివిటీ వచ్చినా కూడా తేజస్విని మాత్రం చాలా ఓపికగా సహనంతో భరించారు.అయితే తాజాగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తేజస్విని తమ ప్రేమ గురించి తెలియజేశారు కోయిలమ్మ సీరియల్ చేస్తున్న సమయంలో మొదట అమర్ తనకు ప్రపోజ్ చేశారని తెలిపారు.దాంతో నేను తన ప్రేమను రిజెక్ట్ చేశానని ఇలా మూడు సంవత్సరాలు పాటు అమర్ పిచ్చోడిలా తిరుగుతూనే ఉన్నాడని అయితే మూడేళ్ల తర్వాత మరోసారి ప్రపోజ్ చేయగా నేను వచ్చి మా ఇంట్లో వాళ్లతో మాట్లాడు వాళ్ళు ఒప్పుకుంటే ఓకే లేదంటే ఇక్కడితో మర్చిపో అని చెప్పాను.
ఇక తన ఫ్యామిలీతో వచ్చి మా ఇంట్లో వాళ్ళని అడగగా ఇద్దరూ పెళ్ళికి ఒప్పుకున్నారని ఈమె తెలిపారు.ఇక అమర్ బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లినప్పుడు తాను చాలా నరకం అనుభవించానని తేజు తెలిపారు.అమర్ హౌస్ లో ఏ విధంగా ఉన్నా కూడా తనపై నెగిటివ్ గానే ప్రచారం చేసేవారు.ఇలా తన గురించి వస్తున్నటువంటి నెగిటివిటీని చూసి నేను చాలా బాధపడ్డాను నరకం చూసాను.
లైవ్ చూడాలంటే కూడా నాకు భయం వేసేది.బిగ్ బాస్ ఒక కర్మ అని ఎప్పుడెప్పుడు ఈ షో అయిపోతుందా అంటూ తాను ఎదురు చూశానని ఇకపై భవిష్యత్తులో తాను బిగ్ బాస్ గురించి మాట్లాడనని ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.