నల్లగొండ జిల్లా:ఫిబ్రవరి 28 లేదా మార్చి మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా రావొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు.ఆయన రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని అన్ని జిల్లాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధి కారులు, సిబ్బందికి ఎన్నికలలో పనిచేసే శిక్షణ పూర్తి చేయాలని కలెక్టర్లకు ముకేష్ కుమార్ ఆదేశించారు.ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు.