టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నందమూరి బాలకృష్ణ ( Balakrishna ) ఒకరు.ఈయన సీనియర్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ప్రస్తుతం వరుస సినిమాలతో యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నటువంటి బాలయ్య వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు.ఇటీవల భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి బాలకృష్ణ ప్రస్తుతం బాబి( Bobby ) డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా NBK 109 గా షూటింగ్ పనులను జరుపుకుంటుంది .ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు.అయితే తాజాగా బాలకృష్ణకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం ఓ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారని ఇది పూర్తికాగానే బాలయ్య సినిమాలకు దూరం కాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
సుమారు రెండు నెలల పాటు ఈయన సినిమా షూటింగులకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.

ఈ విధంగా బాలకృష్ణ సినిమాలకు దూరం కావడానికి కారణం లేకపోలేదు.ఈయన కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా రాజకీయాలలో( Politics ) కూడా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.ప్రస్తుతం బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా బాధ్యతలు వ్యవహరిస్తున్నారు ఇక త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు( Elections ) కూడా రాబోతున్నటువంటి తరుణంలో బాలయ్య ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో బిజీ కాబోతున్నారు.
మరి కొద్ది రోజులలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నటువంటి తరుణంలో సినిమాలకు కొంత సమయం ఇచ్చి పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించాలని వచ్చే ఎన్నికలలో ఎలాగైనా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని బాలయ్య ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండబోతున్నటువంటి తరుణంలో సినిమాలకు విరామం ప్రకటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.







