విశాఖలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.స్థానిక వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ( YCP MP MVV Satyanarayana )మరియు జనసేన నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే జనసేన నేత, ఎమ్మెల్సీ వంశీకృష్ణపై( MLC Vamsikrishna ) ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫిర్యాదు చేశారు.తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వంశీ మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే ఇందుకు ముందు ఎంవీవీపై వంశీకృష్ణ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.విశాఖలో ప్రతి భూ కబ్జా వెనుక ఎంపీ ఎంవీవీ ఉన్నారని జనసేన నేతలు ఆరోపించారు.ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన( TDP – Janasena ) ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న జనసేన నేతలు తమ సర్కార్ వచ్చిన వెంటనే ముందుగా ఎంవీవీపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.







