Penguin Themed Proposal : పెంగ్విన్‌ అవతారంలో ప్రియురాలికి ప్రపోజ్.. కారణం తెలిస్తే షాకే..

ఇటీవల వాలెంటైన్స్ డే( Valentines Day ) ముగిసిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా చాలా మంది లవర్స్ తమ ప్రేమను వ్యక్తపరిచారు.

 Uk Man Dresses Up As Penguin To Propose To His Girlfriend-TeluguStop.com

కొందరు వినూత్న రీతిలో ప్రపోజల్ చేసి తమ ప్రియురాలు మనసును గెలుచుకున్నారు.ఇంగ్లాండ్‌కు ( England ) చెందిన ఆండ్రూ అనే వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌కు ఎవరు ఊహించని రీతిలో ప్రపోజ్ చేశాడు.

అతడు గర్ల్‌ఫ్రెండ్‌ కేట్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.అయితే కేట్‌కి పెంగ్విన్లు అంటే చాలా ఇష్టం.

అందుకే ఆండ్రూ పెంగ్విన్-థీమ్ ప్రపోజల్‌తో ఆమెను ఆశ్చర్యపర్చాలని నిర్ణయించుకున్నాడు.తనకు సహాయం చేయాల్సిందిగా కోట్స్‌వోల్డ్ వైల్డ్‌లైఫ్ పార్క్ అండ్ గార్డెన్స్ సిబ్బందిని కోరాడు.

ఆపై ఒక రోజు, ఆండ్రూ,( Andrew ) కేట్( Kate ) పెంగ్విన్లను చూసేందుకు కోసం పార్కుకు వెళ్లారు.పెంగ్విన్లకు( Penguins ) ఆహారం అందించేందుకు సిబ్బంది కేట్‌కు కొన్ని చేపలను ఇచ్చారు.

ఆండ్రూ ఏదో ఒక పని కోసం కారు వద్దకు వెళ్లాలని చెప్పాడు.కానీ అతను పెంగ్విన్ దుస్తులు ధరించే ఆమె వద్దకు రావాలని అలా వెళ్ళాడు.

అతను కాస్ట్యూమ్‌లో తిరిగి వచ్చి కేట్ వైపు నడిచాడు.తనను పెళ్లి చేసుకోమని మోకరిల్లి అడిగాడు.కేట్ అతడిని పెంగ్విన్ దుస్తులలో చూసి ఆశ్చర్యపోయింది తర్వాత సంతోషం వ్యక్తం చేస్తూ అతని ప్రపోజల్ కు ( Proposal ) ఎస్ చెప్పింది.ఈ మధురమైన క్షణాలను చూసిన పార్కులోని ప్రజలు చప్పట్లు కొట్టి వారిని ఉత్సాహపరిచారు.

ఆండ్రూ, కేట్ ఈ ప్రపోజల్ కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు ఈ పోస్ట్‌పై చాలా మంది హార్ట్ టచ్చింగ్ కామెంట్స్ చేశారు.పార్క్‌లో రొమాంటిక్ మూమెంట్స్ చూస్తుంటే చాలా సంతోషం కలిగిందని కొందరు చెప్పారు.తాను ఖడ్గమృగాల దగ్గర నిశ్చితార్థం చేసుకున్నట్లు ఓ వ్యక్తి చెప్పాడు.రెడ్ పాండాల దగ్గర తన భర్త తనకు ప్రపోజ్ చేశాడని ఒక మహిళ కామెంట్ చేసింది.

ఇకపోతే పెంగ్విన్స్ చాలా అందమైన, నమ్మకమైన జంతువులు.ప్రేమను చూపించడానికి వాటికి ప్రత్యేకమైన మార్గం ఉంది.

అవి తమ తోటి పెంగ్విన్లకు మెరిసే రాళ్లను ఇస్తాయి.వాటికి రాళ్లు బహుమతులు లాంటివి.

పెంగ్విన్లు తమ గుడ్ల కోసం గూడు తయారు చేయడానికి రాళ్లను ఉపయోగిస్తాయి.గూడు అనేక రాళ్లను కలిగి ఉంటుంది.

మగ పెంగ్విన్లు సాధారణంగా రాళ్లను కనుగొంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube