చాలామంది ఇండస్ట్రీలో ఏదో ఒక రకంగా కొన్ని సినిమాలు చేసి సక్సెస్ అయి అలాగే క్రేజ్ ను సంపాదించుకోవాలని చూస్తుంటారు.అందుకోసమే సినిమాలో ఏ అవకాశం వచ్చినా వదులుకోకుండా నటిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు.
కానీ కొంతమంది మాత్రం డబ్బులతో సంబంధం లేకుండా మంచి క్యారెక్టర్లను ఎంచుకొని వాటిలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకోవాలని చూస్తూ ఉంటారు.ఇక అలాంటి వాళ్ళు చాలా అరుదుగా మనకు ఇండస్ట్రీలో కనిపిస్తారు.
ఇక ఇలాంటి కోవ కు చెందిన నటి సాయి పల్లవి.ఈటీవీలో ప్రసారమైన ఢీ ప్రోగ్రాం ద్వారా మొదట కెరియర్ స్టార్ట్ చేసిన సాయి పల్లవి ఆ తర్వాత మలయాళం లో ‘ ప్రేమమ్( Premam ) ‘ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకొని ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల( Sekhar kammula ) డైరెక్షన్ లో వచ్చిన ఫిదా సినిమాతో తెలుగు తెర కు పరిచయమైంది.
ఇక్కడ ఒక సూపర్ సక్సెస్ ని కూడా అందుకుంది.ఇక ఇప్పుడు ఆమె కెరియర్ చాలా సాఫీగా సాగుతుందనే చెప్పాలి.

అయితే ఫిదా సినిమాకి ముందు ఒక పెద్ద డైరెక్టర్ తన సినిమాలో సాయి పల్లవిని( Sai Pallavi ) తీసుకోవాలని అనుకున్నాడట.కానీ ఆ క్యారెక్టర్ చాలా బోల్డ్ గా అలాగే ఎక్స్ పోజింగ్ తో కూడిన క్యారెక్టర్ కావడంతో సాయి పల్లవి ఆ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేసింది.ఇక దానికి ఆ డైరెక్టర్ ఎందుకు ఆ క్యారెక్టర్ రిజెక్ట్ చేశావ్ అని అడిగితే అందులో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి.అలాంటి సీన్స్ నేను చెయ్యను అని చెప్పి తను ఆ సినిమా నుంచి తప్పుకుందట.
ఇక అదే సమయంలో ఆ దర్శకుడు మాట్లాడుతూ ఇండస్ట్రీ లో ఆ క్యారెక్టర్ చేయను, బికినీలు వేసుకొను అంటూ మడికట్టుకొని కూర్చుంటే అవకాశాలు రావు.మంచి సినిమాలు రావు, ఒకవేళ ఒకటి, రెండు సక్సెస్ లు వచ్చిన కూడా ఒక రెండు మూడు సంవత్సరాల కంటే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలవలేరు.

ఇక్కడ అన్నింటికీ కాంప్రమైజ్ అయితేనే సినీ కెరియర్ ఎక్కువ రోజులపాటు కొనసాగుతుంది అంటూ తను చెప్పారట.దాంతో కోపానికి వచ్చిన సాయి పల్లవి నాకు నచ్చిన క్యారెక్టర్లు మాత్రమే చేస్తాను, నాకు అఫర్స్ వచ్చిన, రాకపోయిన నేను నాకు నచ్చిన సినిమాలే చేస్తూ ఉంటాను.వాటితోనే సక్సెస్ సాధించి చూపిస్తాను అంటూ అక్కడి నుంచి వచ్చేసింది.తను అనుకున్నట్టుగానే తనకు నచ్చిన క్యారెక్టర్లలో చేస్తూనే సక్సెస్ అయింది.అలాగే యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.ఇక ఆ దర్శకుడు ఎవరు అనేది బయటికి రావడం లేదు కానీ, సాయి పల్లవి మాత్రం ఆయన తో ఛాలెంజ్ చేసి మరీ సక్సెస్ అయి చూపించింది…








