టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి ప్రియమణి ( Priyamani ) ఒకరు.ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి రెండు దశాబ్దాలు పూర్తి అయ్యాయి.
ఇలా హీరోయిన్గా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ప్రియమణి హీరోయిన్ గా అవకాశాలను కోల్పోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో కీలక పాత్రలలో నటిస్తూ ఉన్నారు.ఇక ఇటీవల కాలంలో ఈమె ఎక్కువగా గృహిని పాత్రలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక త్వరలోనే భామ కలాపం( Bhamakalapam ) అనే సిరీస్ ద్వారా ప్రియమణి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సిరీస్ ఆహాలో ఫిబ్రవరి 16వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమెకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.ఇందులో ప్రియమణి గృహిణిగా హోమ్లీ రోల్ చేశారు.ఈ పాత్రలో ఓ పెద్ద గ్యాంగ్ ని అల్లాడించే వైలెంట్ షేడ్ కూడా ఉంది.మరి నిజజీవితంలో మీరు భర్తను భయపెడతారా లేక మీరే భయపడతారా అనే ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు ప్రియమణి సమాధానం చెబుతూ నేను నా భర్తకు భయపడతాను అలాగే భయపెడతాను కూడా అంటూ సమాధానం చెప్పారు.భార్యాభర్తల జీవితం అన్న తర్వాత కొన్ని సార్లు భర్త మాట భార్య వినాలి అలాగే భార్య మాట కూడా భర్త వినాల్సి ఉంటుందని ఈమె తెలిపారు.ఇక భార్యాభర్తల దాంపత్య జీవితంలో తప్పనిసరిగా గొడవలు చోటు చేసుకుంటూ ఉంటాయి.ఇలా గొడవలు చోటు చేసుకోవడం సర్వసాధారణమని నాకు నా భర్తకు మధ్య కూడా ఇలాంటి గొడవలు ఎన్నో జరిగాయి అంటూ ప్రియమణి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక ఈమె ముస్తఫా రాజ్ ( Mustafa Raj ) అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.ఈయన ఎక్కువగా బిజినెస్ పనుల నిమిత్తం అమెరికాలో ఉండగా ఈమె సినిమాలలో బిజీగా ఉంటూ ఇండియాలోనే ఉంటున్నారు.







