అక్రమంగా తరచు విద్యుత్ తీగలు అమర్చి వన్యప్రాణుల విఘాతం కలిగిస్తే పిడి యాక్ట్ నమోదు చేస్తాం..

వ్యవసాయ పొలాల వద్ద,వన్యప్రాణుల వేట కోసం విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి వన్యప్రాణుల,ప్రజల ప్రాణాలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.అక్రమంగా తరచు విద్యుత్ తీగలు అమర్చి వన్యప్రాణుల, ప్రజల ప్రాణాలకు విఘాతం కలిగిస్తే పిడి యాక్ట్ నమోదు చేస్తాం.

 Pd Act Will Be Registered If The Illegal Installation Of Power Lines Disturbs Wi-TeluguStop.com

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.రాజన్న సిరిసిల్ల జిల్లాలో అడవి జంతువులను వేటాడటానికి విద్యుత్తు తీగలను అమర్చిన, పంట పొలాల కోసం వ్యవసాయ పొలాల వద్ద ఎవరైనా వ్యక్తులు విద్యుత్తు తీగలను అమర్చినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ మేరకు జిల్లా ఎస్పీ గురువారం రోజున ఒక ప్రకటనను విడుదల చేశారు.గడిచిన వారం రోజులలో జిలాల్లో ఇలాంటి సంఘటనలు ఎల్లారెడ్డిపేట్,కొనరావుపేట్, రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు కావడం జరిగిందని, ఇలాంటి సంఘటనలు పదే పదే పునరావృతం అవుతే పిడి యాక్ట్ లు నమోదు చేయడం జరుగుతుందని,గతంలో కొనరావుపేట్ మండలంలో వన్యప్రాణుల కోసం విద్యుత్ తీగలు అమర్చి వ్యక్తి మృతికి కారణం అయిన వ్యక్తి పై పిడి యాక్ట్ అమలు చేయడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… వన్యప్రాణుల వేట కోసం,పంట పొలాలను వన్యప్రాణుల నుండి కాపాడటం కోసం కరెంట్ తీగలను ఏర్పాటు చేయడం వలన పంట పొలాల్లో పనులకు వెళ్లే రైతులు, జంతువులు షాక్ నకు గురయ్యి ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది.జిల్లాలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు సంభవించి అమాయకులు ప్రాణాలను కోల్పోవడం జరిగిందని తెలియజేసారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ జంతువులను వేటాడటం కోసం కరెంటు తీగలను ఏర్పాటు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అవసరమైతే పిడి యాక్ట్ అమలు అమలు చేయడం జరుగుతుందని,గతంలో కొనరావుపేట్ మండలంలో విద్యుత్ తీగలు అమర్చి వ్యక్తి మరణానికి కారణం అయిన వ్యక్తి పై పిడి యాక్ట్ అమలు చేయడం జరిగిందని అన్నారు.

1.ఎల్లారెడ్డిపేట్ మండలం పదిర గ్రామానికి చెందిన దొంతరవేణి విజయ్,కుర్ర భాస్కర్ అనువారు ఇద్దరు కలిసి కరెంటు వైర్ తో విద్యుత్ కనెక్షన్ తీసుకొని మానేరు నది చెక్ డ్యాంలో చేపలు కరెంట్ షాక్ ద్వారా చేపలు పడుతున్నారని ఇరువురిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించడం జరిగింది.

2.రుద్రంగి గ్రామానికి చెందిన గుగులోతు తిరుపతి తండ్రి నందా అను వ్యక్తి తన పంటచేను వద్ద అడవి జంతువుల వేట కొరకు పెట్టిన విద్యుత్ కంచకు తగిలి గుగులోతు హరిసింగ్ యొక్క గేదె మృతి చెందడం జరిగింది.హరిసింగ్ పిర్యాదు మేరకు అక్రమంగా తన పంట పొలం వద్ద విద్యుత్ కంచెను ఏర్పరచిన గుగులోత్ తిరుపతిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది.

3.కొనరావుపేట్ మండలం మర్రిమాడ్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి యెక్క గేదె గ్రామ శివారులోని పంట లోలాల వద్ద పశుగ్రాసం మేస్తుండగా ప్రమాదవసస్తూ నాటు బాంబు పేలి గేదె గాయపడుతుంది.ఈ సంఘటనపై కొనరావుపేట్ ఎస్.ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చెప్పట్టడం జరిగింది.ప్రజా నివాస ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా,లైసెన్స్ లేకుండా జెలాటిన్ స్టిక్స్,పేలుడు పదార్ధాలు నిల్వ ఉంచుతే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు.జెలాటిన్ స్టిక్స్,పేలుడు వంటి పదార్థాలు ఎవరైనా నిల్వ ఉంచుకున్న,ఎవరి దగ్గరైన అయిన ఉన్నాయన్న సమాచారం ఉన్న డయల్ 100 కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అదించాలని సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది అన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube