తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Komatireddy Venkat Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి హరీశ్ రావు ( Harish Rao )వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్ కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని పేర్కొన్నారు.
హరీశ్ రావు సీఎం కావడానికి ప్లాన్ లో ఉన్నట్లున్నారని తెలిపారు.

ఈ క్రమంలోనే కవిత, కేటీఆర్, హరీశ్ రావు పేర్లతో బీఆర్ఎస్( BRS ) విడిపోతుందన్నారు.బీఆర్ఎస్ లో నాలుగు పార్టీలు అవుతాయని విమర్శలు చేశారు.అయితే బీఆర్ఎస్ లో హరీశ్ రావు ఎల్పీ లీడర్ కూడా కాలేరని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో ఇంకో 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.







