కొంతమంది వధూవరులు వెడ్డింగ్( Wedding ) వేడుకలలో తమ పెంపుడు జంతువులు తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటారు.ముఖ్యంగా కుక్కలు, పిల్లులను వేడుకలలో ప్రత్యేక అతిథులుగా కొందరు ట్రీట్ చేస్తారు.
కుక్కలు లేదా పిల్లులతో ఫోటోలు కూడా దిగుతారు.లేదంటే పెళ్లి మండపంలోకి వెళ్లే మార్గంలో వాటితో కలిసి నడుస్తారు.
అయితే యూకేకి( UK ) చెందిన ఒక జంట చాలా భిన్నంగా చేసింది.వారు తమ రింగ్ బేరర్‌గా పెంగ్విన్‌ను( Penguin ) తీసుకొచ్చుకున్నారు.
రింగ్ బేరర్( Ring Bearer ) అంటే వివాహ వేడుకలో వధూవరులకు పెళ్లి ఉంగరాలు తెచ్చి ఇచ్చే వారు.సాధారణంగా, ఓ పిల్లవాడు లేదా దగ్గరి బంధువు ఈ వెడ్డింగ్ రింగ్స్ తెచ్చి వధూవరులకు ఇస్తుంటారు.
అయితే యూకే జంట ఓ పెంగ్విన్‌కు ఆ పని అప్పగించి అతిథులను ఆశ్చర్యపర్చాలని కోరుకున్నారు.వారు ఒక ప్రైవేట్ జూ నుంచి ప్రింగిల్ అనే పెంగ్విన్‌ను అద్దెకు తీసుకున్నారు.
ప్రింగిల్ అనేది హంబోల్ట్ పెంగ్విన్, ఇది దక్షిణ అమెరికాలో నివసించే ఒక రకమైన పెంగ్విన్.
ఈ వధూవరుల పేర్లు జెన్,( Jen ) టామ్.( Tom ) వారి 27, 28 సంవత్సరాల వయస్సు ఉంది.ఇంగ్లాండ్‌లో నివసిస్తున్నారు.2024, ఫిబ్రవరి 3న బ్రిడ్గ్‌నార్త్ పట్టణంలో( Bridgnorth ) వివాహం చేసుకున్నారు.ఈ నూతన దంపతులు ఫోటోగ్రాఫర్ అలెక్స్ ఫోర్డ్‌తో తమ పెంగ్విన్‌తో ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసుకున్నారు.
పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.వేడుకలో జెన్, టామ్ తమ ఉంగరాలను మరచిపోయినట్లుగా ప్రవర్తించారు.వారు గది నుండి బయలుదేరారు, అతిథులు ఆందోళన చెందారు.ఆపై వారు ప్రింగిల్‌తో తిరిగి వచ్చారు, దాని మెడలో ఉంగరాలు ఉన్నాయి.
ప్రింగిల్ పెంగ్విన్ తో పాటు జెన్ సోదరుడు ఆడమ్ చేపల బకెట్‌ను పట్టుకొని వధూవరుల వెనక నడిచాడు.టామ్ సోదరి, క్యారీస్ కూడా మిగతా కలిసి నడిచింది.
అతిథులు పెంగ్విన్‌ను చూసి ఆశ్చర్యపోయారు.నవ్వుతూ దానితో ఫోటోలు దిగారు.ప్రింగిల్‌కు విడ్జెట్ అనే మరో పెంగ్విన్ ఫ్రెండ్ కూడా ఉంది, అది తోడుగా వచ్చింది.దానిని ఫోటోల్లో మీరు చూడవచ్చు.జెన్, టామ్ జంతువులను చాలా ప్రేమిస్తారు.వారు ఒక యూనివర్సిటీలో కలుసుకున్నారు, నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్నారు.
గ్రీస్‌లో స్నార్కెలింగ్ చేస్తున్నప్పుడు జెన్‌కి టామ్ ప్రపోజ్ చేశాడు.ప్రింగిల్ నివసించే అదే జూలో ఉన్న రెయిన్ డీర్‌ను కూడా అద్దెకు తీసుకొచ్చుకున్నారు.పెంగ్విన్, రెయిన్ డీర్‌లను అద్దెకు తీసుకోవడానికి, రవాణా, జంతు నిర్వహణ కోసం వారు సుమారు £1,000 (లేదా రూ.1 లక్ష) చెల్లించారు.పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వాటిని మీరు కూడా చూడండి.