సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ అయినా, చాలా అనుభవం ఉన్నా సరే కొన్నిసార్లు స్టోరీలను ఎంపిక చేసుకోవడంలో పొరపాట్లు చేస్తుంటారు.సూపర్ హిట్ అయ్యే స్టోరీ హిట్టు కాదేమో అని వారు దానిని రిజెక్ట్ చేస్తూ తర్వాత పశ్చాత్తాప పడుతుంటారు.
చాలామంది హీరోలు ఇలాంటి తప్పులు చేసి చేతులు కాల్చుకున్నారు.కొంతమంది పక్క వారు ఇచ్చే సలహాలను కూడా పరిగణలోకి తీసుకొని సినిమాలను చేయకూడదనుకుంటారు.
ఇలాంటి నిర్ణయాలే చివరికి కొంపముంచుతాయి.కొన్నిసార్లు కాపాడతాయి కూడా.
అందువల్ల వీటిలో తప్పొప్పులను మనం చూడలేము.అయితే మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) కూడా ఒక ఫ్రెండ్ మాట విని ఓ సినిమాని రిజెక్ట్ చేశాడు.
దానివల్ల అతడు నష్టపోయాడా లేక లాభపడ్డాడా అనేది తెలుసుకుందాం పదండి.

నిజానికి చిరంజీవికి ఏ సినిమా హిట్ అవుతుంది? ఏది హిట్ కాదు? కథ ఎలా ఉండాలి, అభిమానులకు కథ ఎలా ఉంటే నచ్చుతుంది? అనే అంశాలపై చాలా అవగాహన ఉంది.అందుకే ఈ హీరో మెగాస్టార్ అయ్యాడు.అయితే ఒక సినిమా విషయంలో మాత్రం క్లోజ్ ఫ్రెండ్ అయిన సుధాకర్( Sudhakar ) మాట విన్నాడు.
తొలత దానిని చేయాలా వద్దా అని డైలమాలో ఉన్నాడు.చివరికి ఫ్రెండ్ సుధాకర్ చెప్పినట్లు విందాం అనుకున్నాడు.అతనిని అడిగితే స్టోరీ తనకు నచ్చలేదని రిజెక్ట్ చేయడమే మంచిదేమో అన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశాడు.“చిరు ఈ సినిమా నీకు సూట్ కాదు.” అంటూ బలంగా ఒక సలహా కూడా ఇచ్చాడు.దాంతో మెగాస్టార్ తన వద్దకు వచ్చిన ఆ స్టోరీని రిజెక్ట్ చేశాడు.

అదే కథతో నాగార్జున హీరోగా “రక్షకుడు” ( rakshakudu movie )టైటిల్ తో1997లో ఒక సినిమా తెరకెక్కింది.ఇది భారతదేశ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.దీనిపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి అయితే ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.దాంతో చిరంజీవి బతికిపోయాడు.లేదంటే ఫ్లాప్ అందుకొని చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది.ఆ విధంగా క్లోజ్ ఫ్రెండ్ సుధాకర్ కారణంగా చిరంజీవి సమయం, శ్రమ, కెరీర్ కాపాడుకోగలిగాడు.
అయితే నాగర్జున ఈ సినిమా కథను జడ్జి చేయడంలో విఫలమయ్యాడు.ఆల్రెడీ చిరంజీవి రిజెక్ట్ చేశాడు కదా ఈ సినిమా ఆడుతుందా లేదా అనే కోణంలో బాగా ఆలోచించి ఉంటే అతడు కూడా ఈ ఫ్లాప్ నుంచి బయట పడేవాడు.
ఈ సినిమాని ప్రవీణ్ గాంధీ డైరెక్ట్ చేశాడు.రూ.15 కోట్లతో ఇది రూపొందింది.







