అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ).తన కోడలు లారా ట్రంప్‌ను రిపబ్లికన్ నేషనల్ కమిటీ కో చైర్ పదవికి ఎండార్స్ చేశారు.
ఇది రిపబ్లికన్ పార్టీపై తన పట్టును పెంచడంతో పాటు 2024 అధ్యక్ష ఎన్నికల్లో తన అభ్యర్ధిత్వానికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ట్రంప్ వేసిన ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు.సోమవారం రాత్రి తన ప్రచార బృందం ద్వారా ట్రంప్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇందులో తన కుమారుడు ఎరిక్‌ను వివాహం చేసుకున్న మాజీ టెలివిజన్ ప్రొడ్యూసర్ లారా ట్రంప్‌ను ఆర్ఎన్‌సీ న్యాయవాది మైఖేల్ వాట్లీతో పాటుగా కో చైర్‌గా ప్రతిపాదించారు.ప్రస్తుత ఆర్ఎన్‌సీ చైర్‌వుమెన్ రోన్నా మెక్‌డానియల్( RNC Chairwoman Ronna McDaniel ) త్వరలో పదవీ విరమణ చేసేలా చర్చలు జరుగుతున్నాయని అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

వాట్లీ తొలి నుంచి నాతోనే వుంటున్నారని, తన స్వరాష్ట్రం నార్త్ కరోలినాలో మంచి పనులు చేశారని ట్రంప్ ప్రశంసించారు.ఎన్నికల సమగ్రతకు మైఖేల్ వాట్లీ( Michael Whatley ) కట్టుబడి వున్నారని, ఎందుకంటే ఎన్నికల్లో మోసం జరగకుండా చూసుకోవాలని మాజీ అధ్యక్షుడు పేర్కొన్నారు.2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచానన్న ట్రంప్ తప్పుడు వాదనలకు వాట్లీ మద్ధతు పలికిన సంగతి తెలిసిందే.కమిటీ రోజువారీ కార్యకలాపాలను నిర్వహిస్తూ.
ఆర్ఎన్‌సీ చీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ పాత్రను ప్రభావవంతంగా స్వీకరించమని క్రిస్ లాసివిటాను కోరినట్లు ట్రంప్ వెల్లడించారు.లారా ట్రంప్, మైఖేల్ వాట్లీలు నార్త్ కరోలినాకు చెందిన వారే కావడం గమనార్హం.

మరోవైపు.ఫిబ్రవరి 24న జరగనున్న సౌత్ కరోలినా రిపబ్లికన్ ప్రైమరీ ( South Carolina Republican Primary )తర్వాత తన పదవి నుంచి తప్పుకుంటానని ప్రస్తుత ఆర్‌ఎన్‌సీ కో చైర్ రోన్నా మెక్‌డానియల్ .ట్రంప్‌తో చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.2017 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్న ఆమె.ఎన్నికల్లో పార్టీ ప్రదర్శన, పేలవమైన నిధుల సేకరణపై విమర్శలను ఎదుర్కొంటున్నారు.ఆర్‌ఎన్‌సీ 2023లో 87 మిలియన్ల నిధులను సేకరించగా.
డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ (120 మిలియన్ డాలర్లు) కంటే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం.జో బైడెన్ ఎన్నికల ప్రచార బృందం, ఆయన విజయం సాధించేందుకు మద్ధతు ఇచ్చే ఇతర కమిటీలు సైతం 117 మిలియన్ డాలర్లను సేకరించాయి.







