Under-19 World Cup : అండర్-19 ప్రపంచ కప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ జట్టులో నలుగురు భారత ఆటగాళ్లకు చోటు..!

ఐసీసీ తాజాగా అండర్-19 వన్డే ప్రపంచ కప్ 2024 టీం ఆఫ్ ది టోర్నమెంట్ ( Under-19 World Cup )జట్టును ప్రకటించింది.ఈ జట్టులో నలుగురు భారత ఆటగాళ్లకు చోటు దక్కడం విశేషం.

 Four Indian Players In The Under 19 World Cup Team Of The Tournament-TeluguStop.com

భారత యువ జట్టు నుంచి బ్యాటింగ్ విభాగంలో ఉదయ్ సహారన్, ముషీర్ ఖాన్, సచిన్ దాస్( Uday Saharan, Musheer Khan ) లకు చోటు దక్కింది.బౌలింగ్ విభాగానికి వస్తే భారత యువజట్టు నుంచి సౌమీ పాండే కు చోటు దక్కింది.

భారత యువ జట్టు కెప్టెన్ ఉదయ్ సహారన్ ఈ టోర్నీలో 56 సగటుతో 397 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు.ఇతనికి జట్టులో ఐదో స్థానానికి ఎంపిక చేశారు.ముషీర్ ఖాన్ ఈ టోర్నీలో 60 సగటుతో 360 పరుగులు చేయడంతో వన్ డౌన్ బ్యాటర్ గా అవకాశం దక్కింది.ఇక భారత జట్టు నుండి ఎంపికైన మరొక బ్యాటర్ సచిన్ దాస్ ఫినిషర్ గా అద్భుతంగా రాణించాడు.

సచిన్ దాస్ 60 సగటుతో 303 పరుగులు చేశాడు.దీంతో ఆరో స్థానానికి ఎంపికయ్యాడు.ఇక భారత జట్టు నుండి ఎంపికైన బౌలర్ విషయానికి వస్తే.సౌమీ పాండే( Saumy Kumar Pandey ) ఈ టోర్నీలో 18 వికెట్లు తీసి, అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలో ఒక ఎడిషన్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా సరికొత్త రికార్డు సృష్టించాడు.

దీంతో ఇతనికి కూడా జట్టులో అవకాశం లభించింది./br>

ఇక అండర్-19 ప్రపంచ కప్ 2024 విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు నుండి ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కింది.సౌత్ ఆఫ్రికా జట్టు నుండి ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది.పాకిస్తాన్ వెస్టిండీస్ నుంచి ఒక్కో ఆటగాడికి చోటు దక్కింది.

ఐసీసీ ప్రకటించిన అండర్-19 వన్డే ప్రపంచ కప్ జట్టు ఇదే.లువాన్ డ్రే ప్రిటోరియస్, హ్యారీ డిక్సన్, ముషీర్ ఖాన్, హ్యూవీబ్ జెన్ (కెప్టెన్), ఉదయ్ సహరన్, సచిన్ దాస్, నాథన్ ఎడ్వర్డ్, కల్లమ్ విడ్లర్, ఉబైద్ షా, క్వేనా మఫాక్, సౌమి పాండే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube