దాదాపుగా 20 సంవత్సరాల క్రితం చిరంజీవి, బాలయ్య( Chiranjeevi, Balakrishna ) సినిమాల మధ్య గట్టి పోటీ ఉండేది.చిరంజీవి, బాలయ్య సినిమాలు పోటాపోటీగా థియేటర్లలో విడుదలయ్యేవి.
అయితే గత కొన్నేళ్లలో బాలయ్య భారీ స్థాయిలో మార్కెట్ ను పెంచుకున్నారు.బాలయ్య సినిమాలు మంచి లాభాలను అందిస్తుండటంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు బాలయ్య సినిమాల కోసం ఎగబడుతూ ఉండటం గమనార్హం.

బాలయ్య సినిమాలకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులతో కలిపి 120 నుంచి 140 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది.కొన్ని హక్కుల విషయంలో చిరంజీవి, బాలయ్య సమానంగా ఉన్నారు.చిరంజీవి, బాలయ్య సేమ్ టు సేమ్ అంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్లు సైతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.చిరంజీవి మార్కెట్ సైతం ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

విశ్వంభర సినిమా( Vishwambhara )తో యంగ్ జనరేషన్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇచ్చేలా చిరంజీవి మార్కెట్ ను పెంచుకోవడం జరిగింది.చిరంజీవి వరుసగా విజయాలు సాధించడంలో ఫెయిలవుతుండగా బాలయ్య మాత్రం వరుసగా సక్సెస్ లను అందుకుంటూ సత్తా చాటడం గమనార్హం.బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ కూడా ఊహించని స్థాయిలో ఉన్నారు.రాయలసీమ( Rayalaseema )లో బాలయ్య సినిమాలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి.మాస్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చే ప్రాజెక్ట్ లకు బాలయ్య ఓటేస్తుండగా బాలయ్య హీరోగా సినిమాలను తెరకెక్కించాలని భావిస్తున్న దర్శకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.బాలయ్య సోలో రిలీజ్ డేట్లను ఎంచుకుంటే బిజినెస్ పరంగా మరింత కలిసొస్తుందని చెప్పవచ్చు.
బాలయ్యను సరిగ్గా చూపిస్తే సులువుగా 70 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తాయని బాలయ్య రీసెంట్ సినిమాలు ప్రూవ్ చేశాయి.సక్సెస్ ట్రాక్ లో ఉన్న దర్శకులకు ఛాన్స్ ఇవ్వడం బాలయ్య సక్సెస్ సీక్రెట్ అని కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.







