ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సైంధవ్, గుంటూరు కారం సినిమాలు ఇప్పటికే థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుని ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.నా సామిరంగ మూవీ కూడా మరికొన్ని రోజుల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే హనుమాన్ మూవీ( Hanuman Movie ) మాత్రం ఇప్పటికీ రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ప్రదర్శితమవుతోంది.ఈ వారం ఏకంగా నాలుగు క్రేజీ సినిమాలు విడుదలైనా హనుమాన్ హవా మాత్రం తగ్గలేదు.
ఈ సినిమా 300 కేంద్రాలలో 30 రోజులు ప్రదర్శించబడిందని తెలుస్తోంది.300 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకున్న ఈ మూవీ 300 కేంద్రాలలో ప్రదర్శించబడటం విశేషమే అని చెప్పాలి.ఈ సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో 50 రోజులు ప్రదర్శించబడే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.హనుమాన్ మూవీ మార్చి నెలలో ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది.

జీ5 ఓటీటీ( Zee5 ) ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేయగా ఎనిమిది వారాల డిజిటల్ రిలీజ్ కండీషన్ తో ఈ సినిమా రిలీజైందని తెలుస్తోంది.అయితే థియేటర్లలో అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకున్న హనుమాన్ ఓటీటీలలో ఎలాంటి రికార్డ్ లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) టాలెంట్ కు తగిన గుర్తింపు ఇన్నిరోజుల తర్వాత వచ్చిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

హనుమాన్ సక్సెస్ జై హనుమాన్ పై( Jai Hanuman ) అంచనాలు పెంచేయగా గెటప్ శ్రీను, వరలక్ష్మీ శరత్ కుమార్ లకు కూడా మంచి పేరు వచ్చింది.ఈ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించగా ఈ నటికి మరింత మంచి గుర్తింపు రావాల్సి ఉంది.వినయ్ రాయ్ ఈ సినిమా సక్సెస్ తో విలన్ గా కెరీర్ పరంగా మరింత బిజీ అవుతున్నారు.
తేజ సజ్జా( Teja Sajja ) రేంజ్ మరింత పెరగాల్సి ఉంది.తేజ సజ్జా రెమ్యునరేషన్ కూడా పెరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.







