మౌనీరాయ్( Mouni Roy ).ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేసి సీరియల్ నాగిని( Serial Nagini ) .
ఈ ఒక్క సీరియల్ తో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.తెలుగు,హిందీ,తమిళ అన్ని భాషల్లో విడుదల ఈ సీరియల్ మంచి సక్సెస్ ను సాధించడంతో పాటు మౌనీరాయ్ కి భారీగా గుర్తింపును తెచ్చిపెట్టింది.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన గోల్డ్ మూవీ( Gold movie ) తో వెండితెరకు పరిచయం అయినా ఈమె 2022లో విడుదల అయిన బ్రహ్మాస్త్ర చిత్రంతో అలరించింది.అదే ఏడాది సూరజ్ నంబియార్( Suraj Nambiar ) ను పెళ్లాడింది.
ప్రస్తుతం వర్జిన్ ట్రీ చిత్రంతో బిజీగా ఉంది.

ఇటీవల ఒక ఇంటర్య్వూలో ఆమె ఎదుర్కొన్న సంఘటనలు, వ్యక్తిగత విషయాలు గురించి చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా మౌనీరాయ్ మాట్లాడుతూ.నేను అందంగా, ఆకర్షణీయంగా ఉండనని నన్ను నేను విమర్శించుకుంటూ అదే నిజమనే నిర్ణయానికి వచ్చాను.
ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఈ ఆలోచనల నుంచి బయటపడ్డాను.నన్ను నేను ప్రేమించడం, నన్ను నేను అంగీకరించడంలో ధ్యానం ఎంతో ఉపయోగపడింది.
ఈ విషయం నా స్నేహితులకు తెలుసు.అయితే బయటకు చెప్పడం, మీడియాకు వివరించడం ఇదే మొదటిసారి అని తెలిపింది.
తాజాగా ఇంటర్వ్యూలో భాగంగా మౌని చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆ కామెంట్స్ పై నెట్టిజెన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.అలాగే మౌనిరాయ్ మాట్లాడుతూ.ఇన్నేళ్ల ఏళ్ల నా నటనా జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను.
ఇంత గొప్ప స్థాయిలో నిలిచేందుకు కారణమైన టెలివిజన్ కి రుణపడి ఉంటాను.సినిమాలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తానని భావించి గోల్డ్ చిత్రంలో నటించాను.
అందులో నా పాత్ర నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది.అందుకు నేను సరిపోతాను అనిపించి ఆ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాను.
ఆ తర్వాత బాగానే చేస్తున్నానని మరికొన్ని సినిమాలకు ఆడిషన్స్‌కు వెళ్లాను.లుక్ టెస్ట్ చేసి షార్ట్‌లిస్ట్ చేసిన వాళ్లలో రెండో స్థానంలో నిలిచిన సందర్భాలు ఉన్నాయి.
కానీ అవకాశాలు రాలేదు.వాటికి సరైన కారణాలు ఉండేవి కావు.
సినీ పరిశ్రమ ఇలానే ఉంటుందని అప్పుడు అర్థమైంది.ఏది జరిగినా, చేదు అనుభవాలు ఎదురైనా ముందుకే సాగాలి.
ఇప్పుడు నేను చేయాలి అనుకున్నది చేయగలుగుతున్నాను అది నా అదృష్టం.నేను పడిన కష్టం, విధి విజయాన్ని అందించాయి అని తెలిపింది మౌని రాయ్.