నేడు అండర్-19 ప్రపంచ కప్( Under-19 World Cup ) టైటిల్ కోసం భారత్, ఆస్ట్రేలియా( India , Australia ) మధ్య ఉత్కంఠ భరిత మ్యాచ్ జరగనుంది.సౌత్ ఆఫ్రికా లోని సహారా పార్క్ విల్లోమూర్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఇప్పటికే ఐదు సార్లు అండర్-19 ప్రపంచకప్ టైటిల్ విజేతగా నిలిచిన భారత జట్టు ఆరవసారి టైటిల్ ను అందుకోవాలనే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.
ఉదయ్ సహారన్ ( Uday Saharan )నేతృత్వంలోని భారత యువ క్రికెట్ జట్టు గ్రూప్ దశలో బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికా జట్లను ఓడించింది.
సూపర్ సిక్స్ దశలో భారత జట్టు, న్యూజిలాండ్ జట్టును 214 పరుగుల తేడాతో, నేపాల్ జట్టును 132 పరుగుల తేడాతో ఓడించింది.ఇక సెమీ ఫైనల్లో రెండు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి భారత్ ఫైనల్ చేరింది.

ఆస్ట్రేలియా జట్టు ( Australian team )గ్రూప్ దశలో నమీబియా, జింబాబ్వే, శ్రీలంక జట్లను ఓడించింది.సూపర్ సిక్స్ దశలో ఇంగ్లాండ్ జట్టును డిఎల్ఎస్ పద్ధతిలో 110 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.ఇక వర్షం అంతరాయం కలిగించడం వల్ల వెస్టిండీస్ తో మ్యాచ్ ఫలితం లేదు.సెమీ ఫైనల్లో పాకిస్తాన్ పై విజయం సాధించి ఆస్ట్రేలియా ఫైనల్ చేరింది.

గ్రూప్ దశ నుండి ఓటమి ఎరుగకుండా భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ చేరాయి.టైటిల్ కోసం రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ చాలా కంట భరితంగా సాగే అవకాశం ఉంది.నేడు ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:30 PM కు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.డిస్నీ హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.







