WJLX Radio Station : రాత్రికి రాత్రే 200 అడుగుల టవర్ మాయం చేసిన దొంగలు.. ఎక్కడంటే..

యూఎస్, అలబామా రాష్ట్రంలోని జాస్పర్‌( Jasper )లో ఓ వింత దొంగతనం జరిగింది.WJLX అనే రేడియో స్టేషన్( WJLX radio station ) ఉపయోగించే పెద్ద మెటల్ టవర్‌ను ఎవరో రాత్రికి రాత్రే దొంగిలించారు.

 The Thieves Who Destroyed The 200 Feet Tower Overnight Where Are They-TeluguStop.com

టవర్ 200 అడుగుల పొడవు ఉంది.స్టేషన్ ప్రోగ్రామ్స్‌ యూజర్లకు పంపించడంలో ఇది సహాయపడింది.

ఒక అడవిలో చికెన్ ఫ్యాక్టరీ వెనుక ఈ టవర్‌ను నిర్మించారు.దానిని కనుగొనడం లేదా చేరుకోవడం అంత సులభం కాదు.

గత శుక్రవారం వరకు చోరీ జరిగిన విషయం స్టేషన్ సిబ్బందికి తెలియ రాలేదు.టవర్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి కొంతమందిని పంపినప్పుడు వారు అక్కడ టవర్ మాయమై పోయిందని చూసి షాక్ అయ్యారు.

వారు స్టేషన్ మేనేజర్ బ్రెట్ ఎల్మోర్‌కి ఫోన్ చేసి ఈ బ్యాడ్ న్యూస్ చెప్పారు.కానీ అతను నమ్మలేకపోయాడు.

మీరు సరైన స్థలంలోనే ఉన్నారా? టవర్ పోయిందని కచ్చితంగా చెప్పగలరా? అని అతను వారిని అడిగాడు.

-Telugu NRI

అయితే ఆ టవర్ మాత్రమే దొంగిలించబడలేదు.టవర్ సమీపంలోని ఓ చిన్న భవనంలోకి కూడా దొంగలు చొరబడ్డారు. స్టేషన్ ప్రోగ్రామ్‌లను ప్రసారం చేయడానికి అవసరమైన అన్ని యంత్రాలు, టూల్స్‌ను వారు తీసుకెళ్లారు.

వైర్లను మాత్రం వదిలివేశారు.కానీ అవి కూడా డ్యామేజీ అయ్యాయి.

చోరీపై స్టేషన్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే ఈ కేసుపై పని చేసేందుకు పోలీసుల వద్ద పెద్దగా సమాచారం లేదు.

ఎవరు చేశారో, ఎలా చేశారో, ఎందుకు చేశారో తెలుసుకోలేక పోయారు.కేసు విషయమై మాట్లాడేందుకు స్టేషన్ యాజమాన్యాన్ని కలిశారు.

కానీ వారికి ఈ ఘటనపై ఇంకా చాలానే ప్రశ్నలు ఉన్నాయి.</br

-Telugu NRI

స్టేషన్‌కు దొంగతనం పెద్ద సమస్యగా మారింది.ఇకపై తమ కార్యక్రమాలను ప్రసారం చేయలేమని ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్‌కి చెప్పాల్సి వచ్చింది.FM రేడియోను ఉపయోగించి తమ ప్రోగ్రామ్‌లను పంపడానికి మరొక మార్గాన్ని ఉపయోగించవచ్చా అని వారు FCCని అడిగారు.

కానీ ఎఫ్‌సీసీ నో చెప్పింది.దీంతో ప్రసారాలను పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది.

స్టేషన్‌లో టవర్‌కు, భవనానికి బీమా లేదని కూడా స్టేషన్‌ మేనేజర్‌ తెలిపారు.అంటే మళ్లీ ప్రతిదానికీ వారే డబ్బులు చెల్లించుకోవాల్సి వచ్చింది.

అయితే ఇప్పుడు కొత్త టవర్, కొత్త పరికరాలు కావాలంటే చాలా ఖర్చు అవుతుందని మేనేజర్ అన్నారు.స్టేషన్ చిన్నదని, వీలైనంత త్వరగా తిరిగి ప్రోగ్రామ్స్ ప్రసారం చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

రేడియో స్టేషన్‌కు( Radio station ) యూజర్లు అయిన వారికి కూడా దొంగతనం వల్ల ఇబ్బందిగా కలిగింది.స్టేషన్ సంగీతాన్ని ప్లే చేసింది, శ్రోతలకు వార్తలు సమాచారాన్ని అందించింది.

ఇప్పుడా సేవలు నిలిచిపోవడం యూజర్లు ఇబ్బంది పడ్డారు.అలబామా బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షారన్ టిన్స్లీ కూడా దొంగతనం గురించి ఆందోళన చెందారు.

ఇది ప్రజల భద్రతకు ముప్పు అని ఆమె అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube