Pawan Kalyan Irfan Pathan : పవన్ కళ్యాణ్ కాదు పవర్ స్టార్ అనాలి.. ప్రముఖ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకునే సత్తా ఉన్న హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Power Star Pawan Kalyan ) ఒకరు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సెలబ్రిటీలలో సైతం ప్రత్యేక గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 Famous Cricketer Irfan Pathan Comments About Pawan Kalyan Details-TeluguStop.com

చాలామంది సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ ను ఎంతగానో ఇష్టపడతారు.అయితే ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్( Cricketer Irfan Pathan ) తాజాగా యాంకర్ తో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కాదు పవర్ స్టార్( Power Star ) అనాలి అని చెప్పుకొచ్చారు.

మాజీ టీమిండియా క్రికెటర్ అయిన ఇర్ఫాన్ పఠాన్ తక్కువ సంఖ్యలోనే సినిమాలలో నటించినా ఆ సినిమాలు కమర్షియల్ గా సత్తా చాటాయి.స్టేజ్ పై యాంకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అని చెప్పగా పవన్ కళ్యాణ్ కాదు పవర్ స్టార్ అని చెప్పాలని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోను తెగ వైరల్ చేస్తుండటం గమనార్హం.

పవన్ కళ్యాణ్ కు సెలబ్రిటీలలో సైతం ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పడానికి ఇదే ప్రూఫ్ అని చెప్పవచ్చు.పవన్ కళ్యాణ్ కు ఇప్పటివరకు పాన్ ఇండియా( Pan India ) రేంజ్ లో గుర్తింపు లేకపోయినా రెమ్యునరేషన్ పరంగా కూడా ఆయన టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ పై ప్రస్తుతం ఫోకస్ పెట్టారు.

పవన్ సినిమాల షూటింగ్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.

హరిహర వీరమల్లు( Hari Hara Veeramallu ) సినిమా డైరెక్టర్ క్రిష్( Krish ) ఈ సినిమా నుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క క్రిష్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.ఈ వార్తలు నిజమవుతాయో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube