లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది.ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి( Patnam Mahender Reddy ) కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.
ఈ మేరకు రేపు ఆయన తన సతీమణి, వికారాబాద్ జెడ్పీ ఛైర్ పర్సన్ సునీతతో కలిసి హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఈ క్రమంలోనే రేపు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ను పట్నం దంపతులు కలవనున్నారు.కాగా ఇప్పటికే పట్నం మహేందర్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )ని కలిసిన సంగతి తెలిసిందే.







