Telangana BJP : లోక్‎సభ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ కసరత్తు

లోక్‎సభ ఎన్నికలు( Lok Sabha elections ) రానున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తుంది.ఇందులో భాగంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) నివాసంలో పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది.

 Telangana Bjp Is Preparing For The Lok Sabha Elections-TeluguStop.com

ఈ సమావేశానికి లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ సహా పలువురు నేతలు హాజరయ్యారు.

లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, ప్రచార కార్యక్రమాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు.ఒక్కో లోక్ సభ స్థానానికి ముగ్గురు నుంచి ఐదుగురు పేర్లను పరిశీలించనున్నారు.అదే విధంగా బీసీలకు ఎన్ని సీట్లు ఇవ్వాలనే విషయంపై బీజేపీ నేతలు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

అయితే మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ టికెట్ ను ఈటల రాజేందర్, మురళీధర్ రావు, కూన శ్రీశైలం గౌడ్ తో పాటు చాడా సురేశ్ రెడ్డి ఆశిస్తున్నారు.అలాగే మహబూబ్ నగర్ టికెట్ ను జితేందర్ రెడ్డి( Jithender Reddy )తో పాటు డీకే అరుణ కూడా ఆశిస్తున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube