ఏపీలో టీడీపీ బిజెపి లు కూటమిగా ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇప్పటికే టిడిపి అదినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఢిల్లీకి విడివిడిగా వెళ్లారు.
ఇప్పటికే చంద్రబాబు కేంద్ర హోం మంత్రి తో భేటీ అయి, పొత్తుల అంశం పైన, సీట్ల సర్దుబాటు పైన చర్చించారు .ఇక ఎన్డీఏలో చేరేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపారు.దీంతో అధికారికంగా బిజెపి, టిడిపి, జనసేన పార్టీల మధ్య పొత్తు ప్రకటన రేపో, మాపో వెలువడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఆకస్మాత్తుగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) నేడు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు .ఇప్పటికీ ప్రధాని నరేంద్ర మోది అపాయింట్మెంట్ కూడా ఖరారు కావడంతో, ఈరోజు ప్రధాని నరేంద్ర మోది తో జగన్ భేటీ కాబోతున్నారు.

ఈరోజు రాత్రికి ఢిల్లీకి చేరుకుని తుగ్లక్ రోడ్ లోని తన నివాసంలో జగన్ బస చేస్తారు.ఈరోజు రాత్రి ప్రధాని నరేంద్ర మోది( Narendra Modi )ని కలిసి ఏపీకి సంబంధించి అనేక అంశాలపై జగన్ చర్చించనున్నారు.ఏపీ ప్రయోజన కోసం ఢిల్లీకి వెళ్తున్నారని , ఆ అంశాల పైనే జగన్ చర్చిస్తారని వైసిపి వర్గాలు పేర్కొంటున్నా… ఇది పూర్తిగా రాజకీయ పర్యటన గానే తెలుస్తోంది.ఎన్డీఏలోకి టిడిపిని ఆహ్వానించాలని బిజెపి అధినాయకత్వం నిర్ణయించుకోవడం, దీనిపై చర్చలు తుది దశకు చేరుకోవడం తదితర పరిణామాలతో, జగన్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది.
ఎన్డీఏలో కనుక టిడిపి చేరితే రాజకీయంగా అది తమకు ఎన్నో ఇబ్బందులు కలిగిస్తుందని, ఏపీలో పరిస్థితులు తారుమారవుతాయని జగన్ సైతం ఆందోళన చెందుతున్నారట .

అందుకే బిజెపి అగ్రనేతలను కలిసి టిడిపితో బీజేపీ( BJP , TDP ) పొత్తుల అంశం పైన జగన్ చర్చిస్తారు అని, బిజెపికి తాము పరోక్షంగా ఎప్పుడు మద్దతుగా ఉంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపితో కలవ వద్దు అనే విషయాన్ని జగన్ చెప్పే ప్రయత్నం చేస్తారని అంతా అంచనా వేస్తున్నారు.