Chandrababu Naidu : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ చార్జి షీట్ దాఖలు ఏ1గా చంద్రబాబు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu Naidu )పై పలు కేసులు నమోదు కావటం తెలిసిందే.స్కిల్ స్కాం, అంగళ్ళు గొడవల కేస్, అక్రమ మద్యం కేస్, ఇన్నర్ రింగ్ రోడ్ కేస్, ఫైబర్ గ్రిడ్, ఇన్కమ్ టాక్స్ కేస్, అసైన్డ్ ల్యాండ్ కేసులు వెంటాడుతున్నాయి.

 Cid Added Chandrababu As A1 In Amaravati Inner Ring Road Scam Case-TeluguStop.com

ఈ కేసులలో స్కిల్ డెవలప్మెంట్ కేసు( Skill Development Case )లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు 50 రోజులకు పైగా రిమైండ్ ఖైదీగా ఉన్నారు.గత ఏడాది సెప్టెంబర్ నెలలో అరెస్ట్ అయినా చంద్రబాబు అక్టోబర్ నెలాఖరిలో బెయిల్ రావటం జరిగింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.


ఈ కేసులో సీఐడీ చార్జిషీటు ఏసీబీ కోర్టు( ACB Court )లో దాఖలు చేయడం జరిగింది.ఏ1గా చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి నారాయణను ముద్దాయిగా పేర్కొనడం జరిగింది.లోకేష్, లింగమనేని రాజశేఖర్, రమేష్ లను కూడా ముద్దాయిలుగా చేర్చడం జరిగింది.

సింగపూర్ తో చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఒప్పందం కుదుర్చుకుందని… గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందమే జరగలేదని సీఐడీ పేర్కొనటం జరిగింది.సింగపూర్ తో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్నది తప్పుడు ఒప్పందం అని సీఐడీ తేల్చింది.

చట్ట విరుద్ధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో సుర్భానా జురాంగ్ కు డబ్బులు చెల్లింపులు జరిగినట్లు సీఐడీ నిర్ధారణ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube