నవాబుపేట రిజర్వాయర్ నుండి గుండాలకు నీరందించాలి

యాదాద్రి భువనగిరి జిల్లా: నవాబుపేట రిజర్వాయర్ నుండి గుండాల మండలానికి 32 వేల ఎకరాలకు సరిపడ నీరు రావాల్సి ఉండగా కనీసం 300 ఎకరాలకు కూడా నీరందట్లేదని,కాలువలు మొత్తం పూడి,కంపచెట్లతో నిండిపోయాయని,త్వరగా పూడిక తీసి గుండాల మండలానికి నీరు అందించాలని ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్ అన్నారు.గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా నవాబ్ పేట రిజర్వాయర్ ను కాంగ్రెస్ నాయకులతో కలిసి సందర్శించారు.

 Gundala Should Be Irrigated From The Nawabupeta Reservoir, Gundala Mandal , Nawa-TeluguStop.com

కాలువలను పరిశీలించిన అనంతరం గుండాల మండలానికి రావలసిన నీటి వాట గురించి ఇరిగేషన్ ఏఇ విద్యాసాగర్ తో ఫోన్లో మాట్లాడుతూ నీరు రాకపోతే గుండాల మండలంలోని రైతాంగం బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు.ఏఇ వివరణ ఇస్తూ గతంలో పాలకుర్తి నియోజకవర్గం దేవర్పుల మండలానికి కొంత భాగం నీళ్లు వెలుతున్నాయని,త్వరలో గుండాల మండలానికి రావలసిన వాటను పరిశీలించి కాలువలలోని కంప చెట్లను,పూడికలను తొలగించి నీటిని వదులుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలూరి రామిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ లింగాల భిక్షం గౌడ్,ఇమ్మడి దశరథ, జోగు రమేష్,ఊట్ల భిక్షం, అత్తి సత్తయ్య, కన్నబోయిన యాదగిరి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube