నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ హీరో సినిమాలు వస్తున్నాయంటే బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే అని చెప్పుకోవచ్చు.
బాలకృష్ణ సినిమాలు సాధారణంగా నిర్మాతలకు లాభాలను మిగులుస్తాయి.అయితే బాలయ్య మీద ఎన్నో ఆశలు పెట్టుకొని సినిమా ప్రారంభించిన, ప్రారంభించాలనుకున్న కొందరి నిర్మాతలకు నిరాశ ఎదురయ్యింది.
ఎందుకంటే ఆ సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి.నిజానికి ఆ సినిమాలు రిలీజ్ అయి ఉంటే బాలకృష్ణ రేంజ్ వేరే లెవెల్ లో ఉండేదేమో.మరి ఆ మూవీలు ఏవో, ఎందుకు ఆగిపోయాయో తెలుసుకుందాం పదండి.
• నటరత్న

1986లో నిర్మాత జి.సుబ్బారావు జంధ్యాల ‘నటరత్న’( Nataratna ) టైటిల్‌తో ఒక మూవీ చేద్దాం అనుకున్నాడు.‘నటరత్న’ సినిమా షూట్‌ను అమెరికాలో పూర్తి చేద్దామని జంధ్యాల కోరుకున్నాడు.
కానీ వీసాలు రావడం ఆలస్యం అయ్యింది.మరోవైపు బాలకృష్ణ వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు.
అందువల్ల ఈ సినిమా చేయలేకపోయాడు చివరికి అందులో ఘట్టమనేని రమేష్‌బాబు హీరోగా చేశాడు.అయితే దీనికి నటరత్న అని కాకుండా ‘చిన్నికృష్ణుడు’గా టైటిల్‌ను పెట్టారు.
• శపథమ్

గోపాలరెడ్డి, సుధాకర్‌రెడ్డి కలిసి బాలకృష్ణను హీరోగా పెట్టి ‘శపథమ్’( Sapatham ) అనే 3D సినిమా రూపొందించాలని ప్లాన్ చేశారు.కథ కూడా రాసుకున్నారు.క్రాంతికుమార్‌కు దర్శకత్వ బాధ్యతలు ఇవ్వాలనుకున్నారు కానీ, తెలియని కారణం వల్ల ఈ మూవీ ప్రారంభం కాకుండానే ఆగిపోయింది.
• అశోకచక్రవర్తి

ప్రముఖ నిర్మాత కోగంటి హరికృష్ణ బాలకృష్ణతో ‘బాలకృష్ణుడు’ మూవీ చేస్తున్నట్లు ఒకానొక సమయంలో ప్రకటించారు.ఎస్.ఎస్.రవిచంద్రను దీనికి దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు.కథ కూడా పూర్తిగా ఫినిష్ చేశారు.అంతకుముందు ఎస్.ఎస్.
రవిచంద్ర, కోగంటి హరికృష్ణ దర్శక నిర్మాతలుగా బాలకృష్ణ హీరోగా అశోక చక్రవర్తి( Ashoka Chakravarthy ) సినిమా రూపొందింది.అయితే అశోకచక్రవర్తి, ధ్రువ నక్షత్రం సినిమాలు ఒకే కథతో వచ్చాయి.
పైగా ఇవి రెండూ ఒకే రోజు రిలీజ్ అయ్యాయి.ఈ విషయం తెలిసిన బాలకృష్ణ బాగా కోపం తెచ్చుకున్నాడు.
రెండు కథలు ఎలా ఒకటయ్యాయని ఫీలయ్యాడు.‘బాలకృష్ణుడు’( Balakrishnudu ) సినిమా చేయడానికి ఒప్పుకోలేదు.
• అట కెక్కిన మరిన్ని సినిమాలు

2002లో హీరో బాలకృష్ణ, డైరెక్టర్ వి.సముద్ర కాంబోలో ఒక చిత్రాన్ని నిర్మించడం ప్రారంభించారు బెల్లంకొండ సురేష్.దేశభక్తి, లవ్, సెంటిమెంట్, యాక్షన్ వంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి.బాలకృష్ణను కమాండో పాత్రలో చూపించాలనుకున్నారు.పరుచూరి బ్రదర్స్ ఈ మూవీ కోసం తూటాల్లాంటి మాటలు రాశారు.కానీ ఎందుకో కొన్ని రోజులు షూటింగ్ జరుపుకున్నాక ఈ మూవీ ఆగిపోయింది.

భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ గోపాలరెడ్డి, బాలకృష్ణ కాంబినేషన్లో కోడి రామకృష్ణ( Kodi Ramakrishna ) దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఓ జానపద చిత్రం కూడా మధ్యలోనే ఆగిపోయింది.దీనికి “విక్రమసింహ భూపతి” టైటిల్ అనుకున్నారు.ఇందులో మహారాజుగా, యోధుడుగా బాలకృష్ణ డ్యూయల్ రోల్ పోషించాడు.అయితే మూవీ సగానికి పైగా పూర్తయ్యాక బాలకృష్ణ, గోపాలరెడ్డి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడి మూవీ అర్ధాంతరంగా ఆగిపోయింది.
దీనివల్ల నిర్మాత గోపాల రెడ్డి చాలా నష్టపోయాడు.