చిరంజీవి ( Chiranjeevi )కెరీర్ లోనే అతిపెద్ద విజయం గా ఇంద్ర సినిమా( Indra movie ) గురించి అందరూ చెబుతారు.2002లో బి.గోపాల్ ( B.Gopal )దర్శకత్వంలో అశ్విని దత్ ( Ashwini Dutt )నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలవడం మాత్రమే కాదు.ఆ టైం లో వచ్చిన అన్ని తెలుగు సినిమా కలెక్షన్స్ కన్నా కూడా హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.ఇక ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ .సోనాలి బింద్రే హీరోయిన్స్ గా నటించగా 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 25 కోట్ల రూపాయల వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది.అయితే ఈ సినిమాలో యాక్షన్ పాటలకు ఎంత పేరు వచ్చిందో అలాగే దాయి దాయి దామ్మ అనే పాటలో( Dai Dai Dhamma song ) వీణ స్టెప్ కూడా అదే రేంజ్ లో పాపులర్ అయింది.
ఈ పాటలోని చిరంజీవి వీణ స్టెప్ ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్.

నీకు డాన్స్ వస్తే వీణ స్టెప్పు( Veena step ) వేసి చూపించరా అంటూ సరదాగా ఎవరినైనా ఆట పట్టించడానికి సైతం దీనిని వాడుతారు అంటే ఇది అప్పట్లో రేంజ్ లో హిట్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు.మరి ఇంతటి హిట్ రావడం వెనక ఈ సినిమాకి కొరియోగ్రఫీ చేసిన లారెన్స్ పాత్ర మరియు కష్టం ఎంతో ఉంది.ఎంతో మంది పాటలకు డాన్స్ మాస్టర్స్ గా పని చేస్తున్నారు.
కానీ అందరి కన్న లారెన్స్( Lawrence ) ఖచ్చితంగా ఒక భిన్నమైన వ్యక్తి.చిరంజీవిని ఒక గురువుగా భావించి లారెన్స్ ఆయన కోసం ఎంతో పద్ధతిగా అలాగే కష్టమైన స్టెప్స్ చేస్తూ ఉంటాడు అలాంటిదే ఈ వీణ స్టెప్ కూడా.
అయితే సాధారణంగా ఎవరైనా ఈ వీణ స్టెప్ ప్రాక్టీస్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు.కానీ చిరంజీవికి దీని కోసం ఎంత సమయం పట్టిందో తెలిస్తే మాత్రం ఆశ్చర్యం పోవడం మన వంతు.
ఇక ఈ పాట కోసం లారెన్స్ నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు.

ఇంద్ర సినిమా పాట లు స్విట్జర్లాండ్ లో షూట్ చేస్తున్న సమయంలో చిరంజీవి మరియు లారెన్స్ పార్క్ లో కూర్చుని ఉన్నారట.అప్పుడే ఈ పాట కోసం ఏం స్టెప్స్ ఆలోచించావు లారెన్స్ అని చిరు అడగగా కొన్ని స్టెప్స్ వేసి చూపించాడట.అందులో ఈ వీణ స్టెప్ కూడా ఉందట.
దానిని మళ్లీ మళ్లీ వేయించుకొని మరి చూశారట.చిరంజీవి అయితే మాత్రం రెండుసార్లు మాత్రమే ప్రాక్టీస్ చేశారట.
మొదటి రెండుసార్లు లారెన్స్ చెయ్యి సహాయం తీసుకుని ప్రాక్టీస్ చేయగా మూడోసారి కి వచ్చేసిందట.అలా కేవలం ఐదు నిమిషాల సమయం తీసుకొని ఈ స్టెప్ పూర్తి చేశారట చిరంజీవి మరి మీకు ఎంత సమయం పడుతుందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.







