Tamil Nadu Dhanushkodi : తమిళనాడులో ఉన్న ఇండియాస్ లాస్ట్ రోడ్డు చూశారా.. వీడియో చూస్తే ఫిదా..

భారతదేశంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి, వాటిలో ధనుష్కోడి( Dhanushkodi )లోని భారతదేశపు చిట్ట చివరి రోడ్డు ఒకటి.తమిళనాడులోని పాంబన్ ద్వీపం దక్షిణ చివరన ఈ నగరం ఉంటుంది.

 Have You Seen Indias Lost Road In Tamil Nadu-TeluguStop.com

ఈ టౌన్‌లో లాస్ట్ రోడ్డు చాలా అందంగా ఉంటుంది.ఈ రహదారి సముద్రంతో కలుస్తూ అద్భుతమైన ప్రకృతి అందంగా నిలుస్తూ చాలామందిని కట్టిపడేస్తుంటుంది.

కొంతమంది ఇక్కడ శ్రీరాముడు శ్రీలంక( Sri Lanka )కు వంతెన నిర్మించాడని నమ్ముతారు.

భారత ప్రభుత్వం ధనుష్కోడి వీడియోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో షేర్ చేసింది.పట్టణంలోని ఆ చివరి రహదారి దృశ్యాలను డ్రోన్ ద్వారా రికార్డు చేశారు.ఆ రహదారి ద్వీపం కొన అయిన అరిచల్ మునైకి దారి తీస్తుంది.వీడియోకు “అద్భుతమైన అందాన్ని చూడండి! తమిళనాడు( Tamil Nadu )లోని ధనుష్కోడి వద్ద భారతదేశ చివరి రహదారి.” అని ఒక క్యాప్షన్ జోడించారు.

ఈ వీడియోకు వేళల్లో వ్యూస్, లైక్స్‌, కామెంట్స్‌ వచ్చాయి వీడియో చూసిన చాలామంది అక్కడి అందాలను, వీడియోను కొనియాడారు.“ఇది అద్భుతమైన శివలింగంలా ఉంది! హర్ హర్ మహాదేవ్!” అని ఒక నేటిజన్ కామెంట్ చేశారు.ఇలాంటి అందమైన ప్రదేశాలు కలుషితం కాకుండా ఉండేందుకు పెట్రోల్ డీజిల్ వాహనాలను ఎక్కడికి అనుమతించకపోతే మంచిది అని కొందరు సలహా ఇచ్చారు.ఈ వీడియో తీసిన తిరుమల సంచారి.

ప్రభుత్వం తమను ఆదరించి, గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఇకపోతే ధనుష్కోడిలో బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం కలుస్తాయి.

ఇది పవిత్ర నగరమైన రామేశ్వరం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇది రైల్వే స్టేషన్, పోస్టాఫీసు, ఇతర సౌకర్యాలతో రద్దీగా ఉండే పట్టణం.

కానీ 1964లో, ఒక పెద్ద తుఫాను పట్టణాన్ని తాకి అన్నిటినీ నాశనం చేసింది.తుఫాను వల్ల చాలా మంది ప్రయాణిస్తున్న రైలు కూడా మునిగిపోయింది.

తుపాను కారణంగా చాలా మంది చనిపోయారు.దీని తర్వాత ఇక్కడ నుంచి చాలామంది ప్రజలు తరలిపోయారు.

శిథిలాలు మాత్రమే మిగిలి ఉండటంతో ఇది దెయ్యాల పట్టణంగా మారింది.ధనుష్కోడిని ఇండియాస్ ల్యాండ్స్ ఎండ్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది దక్షిణాన దేశంలోని చివరి పాయింట్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube