సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూలాన ఏం జరిగినా ఇంట్లోనే కూర్చొని తెలుసుకోగలుగుతున్నాం.సోషల్ మీడియాలో డైలీ ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి.
ఆ వైరల్ అవుతున్న వీడియోలో పాముల వీడియోలు లక్షలో ఉంటాయి.అయితే పాముల వీడియోలకు పోటీగా ఇప్పుడు ఒక చేపల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
అందులో అంత వింత ఏముంది అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ వీడియో ఒకసారి చూడాల్సిందే.

ఊసరవెల్లి రంగులు మారుస్తుందనే విషయం అందరికీ తెలిసిందే.అయితే ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో లో చేపలు రంగులు మార్చడం మనం చూడొచ్చు.కళ్ళు మూసి తెరిచేలోగా చేపలు( Fish ) రంగులు మార్చడం అందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
సాధారణంగా ఈ ప్రపంచంలో ప్రకృతి జీవులకు వివధ రూపాలు, విభిన్న సామర్థ్యాలను ఇచ్చింది.సాధారణంగా ఏదైనా జీవి తన స్వభావానికి భిన్నంగా పనిచేస్తే అందరం ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాం.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కూడా అలాంటి వింత ఘటన మనం చూడొచ్చు.ఈ వీడియోలో ఓ బాక్సులో నీళ్లు నింపిన చేపను చూడొచ్చు.ఇది ఇతర చేపల మాదిరిగానే నీటిలో ఈత కొడుతోంది.ఈత కొట్టడంతో పాటుగా ప్రతి సెకనుకు తన రంగులు కూడా మార్చేసుకుంటుంది.వీడియోని గమనించినట్లయితే మొదట్లో మనం చేపల స్కై బ్లూ కలర్ లో కనపడుతుంది.తర్వాత పసుపు రంగులోకి మారుతోంది.
ఈ చేపను టెయిల్ ఫిష్ లేదా ఫ్లాషింగ్ ఫిష్( Flashing fish ) అని పిలుస్తారు.ఈ వీడియో చూసినవారంతా ఆశ్చర్యపోయి వీడియోని షేర్ చేస్తూ లైక్స్ కొడుతున్నారు.







