తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్( Young Rebel Star ) గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా రికార్డులను సృష్టిస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా రిలీజ్ అయిన సలార్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనను మించిన హీరో ఎవరు లేరు అనేది మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు.
ఇక ఇప్పటికే ప్రభాస్ వరుసగా పలు సినిమాలను లైన్ లో పెట్టగా మరి కొన్ని సినిమాల కథలను కూడా వింటున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఏక్ నిరంజన్ సినిమాలో హీరోయిన్ గా మొదట ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) ను తీసుకోవాలి అనుకున్నప్పటికీ ఆమె ప్రభాస్ తో సినిమా చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు.

దాంతో ఆమెను పక్కనపెట్టి కంగనా రనౌత్( Kangana Ranaut ) ను తీసుకున్నాడు.ఇక ఈ సినిమా యావరేజ్ గా ఆడినప్పటికీ ప్రభాస్ కి మాత్రం నటన పరంగా మంచి గుర్తింపును తీసుకొచ్చింది.అంటే ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు కాబట్టి ఇప్పుడు ప్రియాంక చోప్రా ప్రభాస్ తో నటించాలి అని ఉన్నా కూడా ప్రభాస్ తనని రిజెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.మొత్తానికైతే ఒక తెలుగు స్టార్ హీరో పాన్ ఇండియా( Pan India Hero )లో తన సత్తా చాటుకోవడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేయబోయే సినిమాలు కూడా ఇప్పుడు ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాయనే చెప్పాలి.ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్( Prabhas ) వరుసగా సినిమాలు కమిట్ అవుతున్న విషయం మనకు తెలిసిందే…మరి ఈ సినిమాలు అన్నీ ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూడాలి…
.







