Director Teja : చైనా అమ్మాయిల ఉన్నానని డైరెక్టర్ తేజ తిట్టేశారు.. అందుకే ఇలా ?

జయం సినిమా( Jayam Movie )తో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైంది హీరోయిన్ సదా.అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె సినిమాలతో మరియు బుల్లితెరపై కూడా చాలా బిజీ గా కెరియర్ ను కొనసాగిస్తుంది.

 Why Director Teja Shouted On Sada-TeluguStop.com

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉన్న సదా తన సొంత యూట్యూబ్ ఛానల్ కూడా నడిపిస్తుంది.దాంతో తన జీవితంలో జరిగిన అనేక సంఘటనలు అలాగే ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా తన ప్రేక్షకులతో పంచుకుంటుంది.

అయితే అలాంటి ఒక సంఘటన గురించి చెబుతూ తనను డైరెక్టర్ తేజ ( Director Teja )ఎందుకు తిట్టారో చెప్పే ప్రయత్నం చేసింది సదా.ఇంతకు ఏం జరిగింది ? ఎందుకు తిట్టారు ? అని విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


Telugu Teja, Gopichand, Sada, Jayam Climax, Jayam, Tollywood, Teja Sada-Movie

జయం సినిమా షూటింగ్ అంతా కూడా ఫారెస్ట్ లో జరిగింది.క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం కూడా అడవుల్లోనే షూట్ చేయాల్సి వచ్చింది.ఈ చిత్రానికి దర్శకుడుగా ఉన్న తేజ హీరో హీరోయిన్స్ అలాగే మిగతా నటీనటుల అప్పియరెన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు.అయితే సదా( Sada ) మాత్రం ఒక పిచ్చి పని చేసి తేజా చేత తిట్లు తింది.

షూటింగ్ కి మధ్యాహ్నం పూట కాసేపు గ్యాప్ దొరకడంతో తన మేకప్ మెన్  అయిన భాస్కర్ అనే వ్యక్తి తన ఐబ్రోస్( Eye Brows ) విషయంలో కొంచెం చేంజ్ చేద్దామా అని అడిగారట.ఎందుకంటే రెండు కర్లీ వెంట్రుకలు ఉండడంతో అలా కట్ చేద్దాము అని చెప్పడంతో ఆమె కూడా ఓకే చెప్పిందట.

Telugu Teja, Gopichand, Sada, Jayam Climax, Jayam, Tollywood, Teja Sada-Movie

కానీ ఏదో చేయబోయి మరేదో చేసినట్టు కొంచం కట్ చేయబోయి చాలా ఎక్కువగా కట్ చేయడంతో రెండు ఐబ్రోస్ చాలా తేడాగా మారిపోయాయట.దాంతో మరో దాన్ని కూడా సన్నగా కట్ చేయాల్సి వచ్చింది అంట.కానీ పూర్తిగా అపియరెన్స్ మారిపోవడంతో తేజా చూడగానే ఎందుకు నువ్వు చైనీస్ బొమ్మలా( Chinese ) తయారైపోయావు నువ్వు అసలు ఎం చేశావు అంటూ కోపడ్డారట.అలా ఆయన కోప్పడడంతో అప్పటి నుంచి నేటి వరకు ఆమె తన ఐబ్రోస్ తానే సొంతంగా చేసుకుంటారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube