రాబోయే లోక్ సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలవాలంటే.తెలంగాణలో సెంటిమెంటును రగిల్చి, బిఆర్ఎస్( BRS ) శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఆ పార్టీ అధినేత కేసిఆర్ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు.
ఈ మేరకు ‘ చలో నల్గొండ ‘( Chalo Nalgonda ) భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.ఈ మేరకు ఈ సభ నిర్వహణకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు.
నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలు, సమన్వయకర్తలతో విడివిడిగా కేసీఆర్ ( KCR )సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు.
ముఖ్యంగా కృష్ణ నదిపై తెలంగాణ ప్రాజెక్టులు, నీటి హక్కులను భరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర సంస్థ కే.ఆర్.ఎం బీ కే అధికారాలు అప్పగించడం ద్వారా, ముందు ముందు జరగబోయే దుష్పరిణామాలను ఖండిస్తూ వాటిని తెలంగాణ ప్రజలకు వివరించేందుకు నల్గొండ పట్టణంలో ఈనెల 13న నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభ ను విజయవంతం చేసే విధంగా చేపట్టాల్సిన కార్యాచరణ పై పార్టీ నేతలకు కేసీఆర్ అనేక సూచనలు చేశారు.ఈ సభను సక్సెస్ చేసే విధంగా సమన్వయకర్తలను కేసీఆర్ తాజాగా నియమించారు.
హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్( MLA Chanti Kranti Kiran ), దేవరకొండ పంజాల గోపిరెడ్డి, నల్గొండ టౌన్ రవీందర్ సింగ్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మునుగోడు నంది కంటి శ్రీధర్, కోదాడ ఎమ్మెల్సీ రవీందర్ రావు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మిర్యాలగూడ ఆదర్శ్ రెడ్డి, ముజీబ్, సూర్యాపేట మాజీ మంత్రి జోగు రామన్న, నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్, భువనగిరి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నేత జివి రామకృష్ణారావు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు లను నియమించారు.