Groundnut Crop : వేరుశనగ పంటకు తీవ్ర నష్టం కలిగించే సాలీడు పురుగులను అరికట్టే యాజమాన్య పద్ధతులు..!

వేరుశనగ పంటకు( Groundnut Crop ) తీవ్ర నష్టం కలిగించే సాలీడు పురుగులు( Spider Mites ) టెట్రానిచస్ జాతికి చెందినది.ఈ సాలీడు పురుగులలో కొన్ని లేత ఆకుపచ్చ రంగులలో ఉంటే మరికొన్ని ఎరుపు రంగులో ఉంటాయి.

 Proprietary Methods To Prevent Spider Mites Which Cause Severe Damage To Ground-TeluguStop.com

ఈ పురుగులు పొడి మరియు అధిక వేడి ఉండే వాతావరణంలో ఎక్కువగా జీవిస్తాయి.ఈ పురుగులకు చాలా రకాల అతిధి మొక్కలు ఉంటాయి కాబట్టి కలుపు మొక్కల ద్వారా వీటి ఉధృతి బాగా పెరుగుతుంది.

సాలీడు పురుగులు వేరుశనగ మొక్క ఆకులను తినడం వల్ల ఆకు పైభాగం తెలుపు నుండి పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి.ఆ తర్వాత ఆకులు పెళుసుగా మారి, ఆకు ఈనెల మధ్య కత్తిరించబడినట్టుగా ఉండి చివరికి రాలిపోతాయి.

సాలీడు పురుగుల గుడ్లను ఆకుల అడుగు భాగంలో గమనించవచ్చు.వీటి వల్ల భారీ నష్టం జరిగి పంట నాణ్యత కూడా తగ్గుతుంది.

ఈ పురుగుల నుంచి పంటను సంరక్షించుకోవాలంటే తెగులు నిరోధక మేలు రకం విత్తనాలను( Certified Seeds ) సాగుకు ఎంపిక చేసుకోవాలి.ఈ పురుగులను గుర్తించడం కోసం పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.పురుగులు ఆశించిన మొక్కల ఆకులను లేదంటే మొక్కలని పీకేయాలి.ముఖ్యంగా పొలంలో కలుపు మొక్కలు( Weeds ) పెరగకుండా ఎప్పటికప్పుడు పీకేయాలి.సేంద్రీయ పద్ధతిలో ఈ సాలీడు పురుగులను అరికట్టాలంటే.

తులసి, సోయాబీన్, వేప నూనె లతో చేసిన ద్రావణాన్ని ఉపయోగించి అరికట్టాలి.రసాయన పద్ధతిలో ఈ సాలీడు పురుగులను అరికట్టాలంటే.మూడు గ్రాముల వెట్టబుల్ సల్ఫర్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

లేదంటే ఒక మీ.లీ స్పిరో మెసిఫిన్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.ఈ పురుగుల తీవ్రత ఎక్కువగా ఉంటే వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube