Groundnut Crop : వేరుశనగ పంటకు తీవ్ర నష్టం కలిగించే సాలీడు పురుగులను అరికట్టే యాజమాన్య పద్ధతులు..!

వేరుశనగ పంటకు( Groundnut Crop ) తీవ్ర నష్టం కలిగించే సాలీడు పురుగులు( Spider Mites ) టెట్రానిచస్ జాతికి చెందినది.

ఈ సాలీడు పురుగులలో కొన్ని లేత ఆకుపచ్చ రంగులలో ఉంటే మరికొన్ని ఎరుపు రంగులో ఉంటాయి.

ఈ పురుగులు పొడి మరియు అధిక వేడి ఉండే వాతావరణంలో ఎక్కువగా జీవిస్తాయి.

ఈ పురుగులకు చాలా రకాల అతిధి మొక్కలు ఉంటాయి కాబట్టి కలుపు మొక్కల ద్వారా వీటి ఉధృతి బాగా పెరుగుతుంది.

సాలీడు పురుగులు వేరుశనగ మొక్క ఆకులను తినడం వల్ల ఆకు పైభాగం తెలుపు నుండి పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి.

ఆ తర్వాత ఆకులు పెళుసుగా మారి, ఆకు ఈనెల మధ్య కత్తిరించబడినట్టుగా ఉండి చివరికి రాలిపోతాయి.

ఈ సాలీడు పురుగుల గుడ్లను ఆకుల అడుగు భాగంలో గమనించవచ్చు.వీటి వల్ల భారీ నష్టం జరిగి పంట నాణ్యత కూడా తగ్గుతుంది.

"""/" / ఈ పురుగుల నుంచి పంటను సంరక్షించుకోవాలంటే తెగులు నిరోధక మేలు రకం విత్తనాలను( Certified Seeds ) సాగుకు ఎంపిక చేసుకోవాలి.

ఈ పురుగులను గుర్తించడం కోసం పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.పురుగులు ఆశించిన మొక్కల ఆకులను లేదంటే మొక్కలని పీకేయాలి.

ముఖ్యంగా పొలంలో కలుపు మొక్కలు( Weeds ) పెరగకుండా ఎప్పటికప్పుడు పీకేయాలి.సేంద్రీయ పద్ధతిలో ఈ సాలీడు పురుగులను అరికట్టాలంటే.

"""/" / తులసి, సోయాబీన్, వేప నూనె లతో చేసిన ద్రావణాన్ని ఉపయోగించి అరికట్టాలి.

రసాయన పద్ధతిలో ఈ సాలీడు పురుగులను అరికట్టాలంటే.మూడు గ్రాముల వెట్టబుల్ సల్ఫర్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

లేదంటే ఒక మీ.లీ స్పిరో మెసిఫిన్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

ఈ పురుగుల తీవ్రత ఎక్కువగా ఉంటే వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

సిద్దు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ ల పరిస్థితి ఏంటి..?