సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలలో చాలామంది సక్సెస్ కావడం వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి.స్టార్ హీరో యశ్( Yash ) వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
కేజీఎఫ్, కేజీఎఫ్2( KGF, KGF 2 ) భాషతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి నిర్మాతలకు మంచి లాభాలను అందించడంతో పాటు ఈ సినిమాల వల్ల యశ్, ప్రశాంత్ నీల్, హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పేరు మారుమ్రోగింది.
అయితే 16 సంవత్సరాల వయస్సులో ఉన్న సమయంలో ఒక సినిమా కోసం తెర వెనుక కార్మికుడిగా పని చేశారు.
ఆ సమయంలో యశ్ రెమ్యునరేషన్( Yash Remuneration ) కేవలం 50 రూపాయలు కావడం గమనార్హం.ఇప్పుడు 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్న యశ్ తన టాలెంట్ తో ఈ స్థాయికి ఎదిగాడు.
తర్వాత రోజుల్లో యశ్ కు సీరియల్స్ లో ఆఫర్లు రాగా ఉత్తరయాన్ సీరియల్ తో( Uttarayan Serial ) కెరీర్ మొదలైంది.

సీరియళ్లలో నటిస్తున్న సమయంలో యశ్ కు కొన్ని సినిమాలలో ఆఫర్లు వచ్చాయి.అయితే వేర్వేరు కారణాల వల్ల ఆ సినిమాలలో యశ్ నటించలేకపోయారు.ఆ సినిమాలలో నటించి ఉంటే యశ్ కు కొన్ని సంవత్సరాల ముందే స్టార్ స్టేటస్ అయితే వచ్చి ఉండేది.
మొదలసాలా( Modalasala Movie ) అనే రొమాంటిక్ కామెడీ మూవీతో సక్సెస్ సాధించిన యశ్ ఆ సినిమా తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ప్రస్తుతం టాక్సిక్( Toxic ) అనే సినిమాలో నటిస్తున్న యశ్ తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు.యశ్ టాక్సిక్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తారేమో చూడాలి.వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.యశ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంత్కంతకూ పెరుగుతోంది.300 రూపాయలతో బెంగళూరుకు వచ్చిన యశ్ తన టాలెంట్ తో అంతకంతకూ ఎదిగారు.







