ఏపీ అసెంబ్లీ( AP Assembly )లో మరోసారి గందరగోళం నెలకొంది.అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఈలలు వేస్తూ నిరసన తెలుపుతున్నారు.
స్పీకర్ పోడియాన్ని చుట్టిముట్టిన టీడీపీ సభ్యులు సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారు.ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం( Tammineni Sitaram )పై పేపర్లు చింపి విసిరేశారు.
అలాగే గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంలో టీడీపీ సభ్యులు ఘర్షణకు దిగారు.ఈ క్రమంలోనే టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని( Tammineni Sitaram ) సస్పెండ్ చేశారు.ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.