యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల ఎంపీడీవో ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ల అవినీతి తారాస్థాయికి చేరిందని,పైసా ఇవ్వనిదే పైలు కదిలే పరిస్థితి లేదని మండల ప్రజలు వాపోతున్నారు.వివిధ సమస్యలపై ఎంపీడీవో కార్యాలయానికి వెళ్ళిన వారి సమస్యలను పరిష్కరించకుండా దురుసుగా ప్రవర్తిస్తూ సమస్య పరిష్కారం కావాలంటే రుసుము చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఏ చిన్న పని మీద వెళ్లినా రూ.100 నుండి రూ.1000 వరకు డిమాండ్ చేస్తున్నారని, స్థానిక మీ సేవ కేంద్రంతో ఒప్పందం చేసుకొని
ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామ పంచాయతీ కార్యదర్శులు వివిధ సర్టిఫికెట్స్ అప్రూవల్స్ కోసం ఎంపీడీవో ఆఫీస్ లోని కంప్యూటర్ ఆరేటర్లు వద్దకు వెళ్ళమని చెప్పగా డబ్బులు ఇచ్చిన వారికి వెంటనే అప్రూవల్స్ ఇవ్వడం లేదంటే ఏదో ఒక కుంటి సాకుతో ఆఫీస్ చుట్టూ తిప్పించుకోవడం పరిపాటిగా మారిందని అంటున్నారు.
ప్రజా ప్రతినిధులు,అధికారులు ఇంతా జరుగుతున్నా చోద్యం చూస్తూ ఉండిపోవడం గమనార్హం.ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎంపీడీవో ఆఫీస్ లో జరిగే అవినీతిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.







