మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టారు నటి లావణ్య త్రిపాటి( Lavanya Tripathi ) ఉత్తరాది అమ్మాయి అయినప్పటికీ ఈమె తెలుగు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా తెలుగు సినిమాలలో నటిస్తున్న సమయంలోనే మెగా హీరో వరుణ్ తేజ్( Varun Tej ) ప్రేమలో పడి పెద్దల సమక్షంలో వీరిద్దరూ గత ఏడాది నవంబర్ నెలలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఇక ఈమె మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టడంతో మెగా ఫాన్స్ అందరు కూడా ఈమెను వదిన( Vadhina ) అంటూ పిలవడం మనం చూస్తున్నాము తాజాగా మెగా ఫ్యాన్స్ తనని వదిన అని పిలవడం గురించి ఈమె రియాక్ట్ అవుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

లావణ్య త్రిపాఠి పెళ్లికి ముందే నటించడం మిస్ ఫర్ఫెక్ట్( Miss Perfect ) అనే వెబ్ సిరీస్ ఇటీవల విడుదలైన సంగతి మనకు తెలిసిందే.ఈ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది.ఇక ఈ సిరీస్ విడుదలైనటువంటి తరుణంలో లావణ్య త్రిపాఠి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొని ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమెకు తనని వదిన అని పిలవడం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ విషయం గురించి లావణ్య మాట్లాడుతూ నన్ను మెగా ఫ్యామిలీలో నిహారిక( Niharika ) తప్ప ఎవరు కూడా వదినా అని పిలవరని ఈమె తెలిపారు.

ఇక మెగా ఫాన్స్( Mega Fans ) అందరు కూడా మిమ్మల్ని వదినా అని పిలుస్తారు తెలుసా అని చెప్పడంతో అవునా సో స్వీట్ అంటూ ఈమె సంతోషం వ్యక్తం చేశారు.ఇక మెగా ఫ్యామిలీలో తన జర్నీ గురించి కూడా ఈమె తెలియజేశారు.మెగా ఫ్యామిలీలో అందరూ కూడా నన్ను ఎంతో ప్రేమతో స్వాగతిస్తారని తెలిపారు.కేవలం మెగా కుటుంబ సభ్యులు మాత్రమే కాదు మెగా ఫ్యాన్స్ ప్రేమను కూడా పొందుతున్నాను.
తాను మెగా ఫ్యామిలీలోకి కోడలిగా రావడానికి చాలా గౌరవంగా భావిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా లావణ్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







