Cancer : క్యాన్సర్ ముప్పును పెంచే 5 ప్ర‌మాద‌క‌ర‌మైన అల‌వాట్లు ఇవే!

క్యాన్సర్( Cancer ) .ప్రస్తుత రోజుల్లో ఈ మహమ్మారి ఎంత వేగంగా విజృంభిస్తుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.

 These Are The 5 Dangerous Habits That Increase The Risk Of Cancer-TeluguStop.com

స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా ప్ర‌తి ఏడాది ఎంతో మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు.అందుకే క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం.

ఈ నేపథ్యంలోనే క్యాన్సర్ ముప్పును పెంచే ఐదు ప్రమాదకరమైన అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్( Fast foods, fried foods ), ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.అందుకే తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, నట్స్( Fruits, vegetables, greens, seeds, nuts ) వంటి ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి.

వీటిలో ఉండే పోష‌కాలు మరియు శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి అండంగా ఉంటాయి.క్యాన్స‌ర్ క‌ణాల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తాయి.

Telugu Alcohol, Cancer, Habits, Latest-Telugu Health

నిశ్చల జీవనశైలి క్యాన్సర్ వచ్చే ముప్పును ఎక్కువ చేస్తుంది.నిశ్చల జీవనశైలి అనేది ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది.శరీరానికి ఎటువంటి శ్రమ పెట్టకుండా తినడం పడుకోవడం.ఇలాంటి లైఫ్ స్టైల్ ను సాగించేవారు ఊబకాయం, మధుమేహం, గుండెపోటు ( Obesity, diabetes, heart attack ) మరియు క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడతారు.

అందుకే కాస్త ఒల్లు వంచండి.రోజుకు అరగంట నుంచి గంట వరకు వ్యాయామం చేయండి.అలాగే గంటల తరబడి యూవీ కిరణాలకు బహిర్గతం అవ్వడం వల్ల కూడా క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది.సరైన రక్షణ దుస్తులు లేకుండా ఎక్కువ సేపు సూర్యరశ్మికి గురికావడం ఏమాత్రం మంచిది కాదు.

క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే చెత్త అలవాట్లలో ధూమపానం( smoking ) ఒకటి.మూత్రాశయం, గొంతు మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ కు పొగాకు మూలకారణం.

Telugu Alcohol, Cancer, Habits, Latest-Telugu Health

పైగా ధూమపానం చేయడం వల్ల మీతో పాటు మీ చుట్టూ ఉన్నవారు కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉంటాయి.కాబట్టి ధూమపానానికి దూరంగా ఉండండి.ఇక‌ మితిమీరి మద్యం తీసుకునే అలవాటు ఉంటే వెంట‌నే మానుకోండి.ఎందుకంటే అతిగా మద్యాన్ని సేవించడం వల్ల కూడా క్యాన్సర్ బారిన పడతారు.పీపాలు పీపాలు మద్యం తాగడం వల్ల కొలెరెక్టల్, బ్రెస్ట్ మరియు లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube