ప్రతి వారం ఎన్నో సరికొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉంటాయి ఇలా ప్రతివారం థియేటర్ లతోపాటు డిజిటల్ మీడియాలో కూడా ఎన్నో సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాయి.ఇక ఫిబ్రవరి 2వ వారంలో కూడా ఎన్నో కొత్త సినిమాలు విడుదలకు సిద్ధం కాగా మరికొన్ని సినిమాలు కూడా డిజిటల్ మీడియాలో స్ట్రీమింగ్ కానున్నాయి.మరి ఈవారం థియేటర్లలోను అలాగే డిజిటల్ మీడియాలోనూ ప్రసారమయ్యే సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే.
ఈగల్:
రవితేజ( Raviteja ) హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం ఈగల్( Eagle ) ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా సంక్రాంతి పోటీ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పోటీ నుంచి తప్పుకుంది దీనితో ఫిబ్రవరి 9వ తేదీ ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
లాల్ సలామ్:
ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.ఈ సినిమా కూడా సెప్టెంబర్ 9 న విడుదల కానుంది.
కెమెరామెన్ గంగతో రాంబాబు:
పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు( Cameraman Gangatho Rambabu ) 2012లో వచ్చిన ఈ చిత్రం రీరిలీజ్‌కు సిద్ధమైంది.ఫిబ్రవరి 7న ఎంపిక చేసిన థియేటర్‌లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
యాత్ర2:
యాత్ర సినిమా సీక్వెల్ సినిమా అయిన యాత్ర 2( Yatra 2 ) ఫిబ్రవరి 8 న విడుదల అవడానికి సిద్ధంగా ఉంది.
ఓటీటీలో వచ్చే సినిమాలు
నెట్‌ఫ్లిక్స్:
వన్ డే (హాలీవుడ్) ఫిబ్రవరి 8 నప్రసారం కానుంది.భక్షక్ (హిందీ సిరీస్) ఫిబ్రవరి 9 నప్రసార కానుంది.మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం( Guntur Karam ) సినిమా కూడా ఫిబ్రవరి 9వ తేదీ ప్రసారం కానుంది.
అమెజాన్ ప్రైమ్:
ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమా( Captain Miller ) తొమ్మిదో తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
ఆర్య (హిందీ సిరీస్) ఫిబ్రవరి 9 న ప్రసారం కాబోతోంది.
బుక్ మై షో
ఆక్వామెన్(హాలీవుడ్)( Aquaman ) ఫిబ్రవరి 5న ప్రసారం కానుంది.
ఆహా:
బబుల్‌గమ్(తెలుగు)( Bubblegum ) ఫిబ్రవరి9 న ప్రసారం కానుంది సుమ కుమారుడు హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్లలో పర్వాలేదనిపించింది.
నేడు ఓటీటీలో విడుదలైన సినిమాలు ఇవే ( Telugu OTT Movies Week Release List )
Movie Name | Release Date | Online Streaming Partner |
---|---|---|
వన్ డే (హాలీవుడ్) | ఫిబ్రవరి 8 | నెట్‌ఫ్లిక్స్ |
భక్షక్ (హిందీ సిరీస్) | ఫిబ్రవరి 9 | నెట్‌ఫ్లిక్స్ |
గుంటూరు కారం( Guntur Karam ) | ఫిబ్రవరి 9 | నెట్‌ఫ్లిక్స్ |
కెప్టెన్ మిల్లర్ సినిమా( Captain Miller ) | ఫిబ్రవరి 9 | అమెజాన్ ప్రైమ్ |
ఆర్య (హిందీ సిరీస్) | ఫిబ్రవరి 9 | డిస్నీ ప్లస్ హాట్ స్టార్ |
ఆక్వామెన్(హాలీవుడ్)( Aquaman ) | ఫిబ్రవరి 5 | బుక్ మై షో |
బబుల్‌గమ్(తెలుగు)( Bubblegum ) | ఫిబ్రవరి 9 | ఆహా |