సినిమా ఇండస్ట్రీలో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి.ఒక సినిమా కి కమిట్ అయిన తర్వాత హీరోని హీరోయిన్స్ ని లేదా డైరెక్టర్స్ ని మార్చ సందర్భాలు ఎన్నో ఉంటాయి.
కానీ సినిమాకు విడుదలకు ముందు రోజు ఒక డైరెక్టర్ పేరు తీసేసి హీరో గారి భార్య పేరు సినిమాకి వచ్చింది అంటే దాని వెనక ఎంతో కథ నడిచే ఉంటుంది.మరి రాత్రి రాత్రి దర్శకుడి పేరు మార్చిన ఆ సినిమా ఏంటి దాని పరిణామాలు ఏంటి అనే విషయాన్ని ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇలా పేరు మార్చబడిన సినిమా మరేదో కాదు ఎవడైతే నాకేంటి.( Evadaithe Nakenti Movie ) ఈ చిత్రంలో హీరోగా నటించిన యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్( Rajasekhar ) కాగా సినిమాకు రాత్రికి రాత్రి పేరు మార్చిన డైరెక్టర్ అలాగే థియేటర్లలో తెరపై పడిన పేరు రాజశేఖర్ భార్య జీవితది( Jeevitha Rajasekhar ) కావడం విశేషం.
సాధారణంగా రాజశేఖర్ సినిమా ఒకటి విడుదలయితే ఆ తర్వాత వరస ఫ్లాపులు పలకరిస్తూ ఉంటాయి.అలా చాలా సందర్భాల్లో అనేక పరాజయాల నడుమ దక్కిన మంచి విజయం ఎవడైతే నాకేంటి చిత్రం.
ఇది 2007లో విడుదల అయ్యి విజయాన్ని అందించింది.ఈ చిత్రానికి మొదట అనుకున్న డైరెక్టర్ సింహరాశి చిత్రానికి దర్శకత్వం వహించిన వి.సముద్ర.( Director V Samudra ) ఇంకా ఈ సినిమాకి సాయికుమార్ రాజశేఖర్ పాత్రకు డబ్బింగ్ చెప్పారు.పొలిటికల్ డ్రామాగా తెరకెక్కి యాక్షన్ ఎంటర్టైనర్ గా నిలిచినటువంటి ఈ చిత్రం రాజశేఖర్ కి సక్సెస్ తో పాటు మరిన్ని సినిమాల్లో నటించేందుకు ఊపిరిని పోసింది.
మామూలుగా రాజశేఖర్ కి ఎప్పుడైనా సాయికుమార్( Saikumar ) వాయిస్ చాలా బాగా సూట్ అవుతుంది.ఆయన వాయిస్ ఎవడైతే నాకంటే చిత్రానికి కచ్చితంగా మెయిన్ అసెట్.అలాగే ఈ చిత్రానికి మరొక ప్రధాన బలం గా రాజశేఖర్ నటన మాత్రమే.
అలాగే రఘువరన్ కూడా అద్భుతమైన పాత్రలో నటించారు.ఈ సినిమాకు ముందు మూడేళ్ల పాటు పరజయాలు చవిచూసిన రాజశేఖర్ కి ఇది కొంత రిలీఫ్ కాగా ఈ చిత్రం తర్వాత మళ్లీ పరాజయాల బాటే పట్టాడు.
ఇప్పటికీ అతని కెరియర్ చాలా అప్ అండ్ డౌన్స్ తో కొనసాగుతుంది.