తెలుగుదేశం పార్టీతో పొత్తు , సీట్ల పంపకాల విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను( Pawan Kalyan ) ప్రశ్నిస్తూ కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు మాజీ మంత్రి చేగోండి హరి రామ జోగయ్య( Chegondi Harirama Jogaiah ) అనేక ప్రశ్నలు సంధిస్తూ పవన్ కళ్యాణ్ కు ఘాటుగానే లేఖ రాశారు.పొత్తులో భాగంగా జనసేనకు ఆరకొర సీట్లు కేటాయిస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై జోగయ్య స్పందించారు.
దామాషా ప్రకారం సీట్లు కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడుతారని, కనీసం రెండున్నరేళ్లు పవన్ సీఎంగా ఉంటారనే మాటను చంద్రబాబుతో( Chandrababu Naidu ) చెప్పించి తీరాలంటూ జోగయ్య లేఖ ద్వారా పవన్ ను డిమాండ్ చేశారు.

జనసేనకు 30 లేదా 27 సీట్లు అంటూ ఏకపక్షమైన వార్తలను టిడిపి అనుకూల మీడియాలో వస్తున్నాయి.ఆ వార్తలు ఎవరిని ఉద్ధరించడానికి అంటూ జోగయ్య ప్రశ్నించారు.ఆయా పార్టీ శ్రేణులు ఈ విషయాన్ని గ్రహించాలంటూ లేఖ ద్వారా అనేక ప్రశ్నలు సంధించారు.
వైసిపిని రాజ్యాధికారం నుంచి తప్పించడం అంటే టిడిపికి( TDP ) రాజ్యాధికారం కట్టబెట్టడం మాత్రమే కాదని, అసలు కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణం చేస్తుంది ఈ ఆలోచనతో కాదనే విషయాన్ని గుర్తించాలంటూ లేఖ ద్వారా చురకలు అంటించారు.జనసేన( Janasena ) మద్దతు లేకుండా టిడిపి అధికారంలోకి రావడం కష్టమని, అందుకు 2019 ఎన్నికల ఫలితాలే ఉదాహరణ.

175 సీట్లు ఉన్న రాష్ట్రంలో 50 సీట్లు అయినా దక్కించుకోగలిగితేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని, 40 ,60 సీట్ల మధ్య పోటీ చేసి తీరాలని పవన్ కు సూచించారు.అధికారం అంతా చంద్రబాబుకే దార పోసి మీరు కలలు కంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా సాధ్యమవుతాయంటూ పవన్ ను ప్రశ్నించారు.జనసైనికులు సంతృప్తి పడేలా పంపకం జరగకపోయినా, ముఖ్యమంత్రి పదవి రెండున్నర సంవత్సరాలైనా కట్టబెట్టబోతున్నట్లు చంద్రబాబు నోటి వెంట ఎన్నికలకు ముందే ప్రకటించగలుగుతారా అని జోగయ్య లేఖ ద్వారా పవన్ ను ప్రశ్నించారు.







